twitter
    TelugubredcrumbMoviesbredcrumbVirusbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఏ సినిమాకైనా కథే ప్రధాన బలం.... కథ కాస్త అటు ఇటుగా ఉన్నా మంచి స్క్రీన్ ప్లే ఉంటే ప్రేక్షకుడిని సంతృప్తి పరచవచ్చు. ఈ సినిమా విషయంలో కథ చాలా రొటీన్, ఇక స్క్రీన్ ప్లే కూడా అంత ఆసక్తికరంగా లేదు. పేరుకే కామెడీ సినిమా గానీ ఎక్కడ కామెడీ పేలలేదు. అయితే సినిమాలో అసలు విలన్ ఎవరో చెప్పకుడా చివరి వరకు కాస్త సస్పెన్స్ మెయింటేన్ చేసి సినిమా క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చాడు.

      సినిమా ఎలా ఉందనే విషయాన్ని పక్కన పెడితే చివర్లో మంచి సందేశం ఇచ్చారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా అతి వాడకం వల్ల ప్రస్తుతం మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయి.... వాటి ప్రభావం ఇప్పటి పిల్లలపై, మనపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతోంది. ఎలాంటి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయం బాగా చూపారు. సినిమాకు శుభం కార్డు పడే ముందు.... సంపూ తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. ఒక మామూలోడు ఇంటర్నెట్‌ను బాగా వాడుకుని బర్నింగ్ స్టార్ అయ్యాడు.... కానీ కొందరు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో మోజులో చెడు దారులు పడుతూ తమ జీవితాలను బర్న్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్లో బ్రతకడం మానేసి మనుషులతో కలిసి బ్రతుకుదాం అనే మీనింగ్ వచ్చేలా సంపూ చివర్లో చెప్పిన డైలాగులు ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X