వైరస్ (2017)
వైరస్ స్టోరి
వైరస్ సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంపూర్ణేష్ బాబు, నిదిశా రెడ్డి, గీతా షా, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఆర్ కృష్ణ వహించారు మరియు ఎస్ ఎస్ ఫిలిమ్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై సలీమ్, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మీనాక్షి భుజంగ్, సునిల్ కౌషప్ కలిసి స్వరాలు సమకుర్చరు.
కథ
కిట్టు(సంపూర్ణేష్ బాబు) ఓ ప్రొఫెషనల్ హ్యాకర్. అమెరికాలో నెలకు 20 లక్షలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న ఇతడు.... ఉన్నట్టుండి ఆ ఉద్యోగాన్ని వదిలేసి, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని వంశీ ఎన్క్లేవ్ అనే అపార్టుమెంటులో కేవలం రూ. 5 వేల జీతానికి కేబుల్ బాయ్‌గా చేరుతాడు. అపార్టుమెంటులోని అందరి ఇళ్లలో, వాళ్ల బెడ్రూముల్లో కూడా వారికి తెలియకుండా సిసి కెమెరాలు పెట్టి వాళ్లు ఏం చేస్తున్నారని పరిశీలిస్తూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే అపార్టుమెంట్ ప్రెసిడెంట్ రాఘవరావు హత్య జరుగుతుంది. ఆ నేరం కిట్టూ మీద పడుతుంది. పోలీసులు అతన్ని అరెస్టు చేస్తే.... దేశంలోనే పెద్ద లాయర్ శ్యాంజఠ్మలానీ వచ్చి సంపూకు బెయిల్ ఇవ్వడం చూసి అంతా ఆశ్చర్యపోతారు. అమెరికాలో అంత మంచి జీవితాన్ని, జీతాన్ని వదిలేసి.... కిట్టూ ఇక్కడ ఇలాంటి జీవితం ఎందుకు గడుపుతున్నాడు? www.వైరస్.comకు, సంపూకు సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.