twitter

    యమన్ స్టోరి

    యమన్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ ఆంటోని, మియా జార్జ్, త్యాగరాజన్, సంగిలి మురుగన్, మరిముతు, చార్లే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జీవ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత మిర్యాల రవింద్రర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విజయ్ ఆంటోని స్వరాలు సమకుర్చరు. 
     
    కథ

    అశోక చక్రవర్తి ( విజయ్ ఆంటోని) ఓ మామూలు వ్యక్తి. క్యాన్సర్ వ్యాధిన పడిన తన బామ్మ చికిత్స కోసం మూడు లక్షల రూపాయాలు అవసరం ఏర్పడుతుంది. డబ్బు కోసం ఓ యాక్సిడెంట్ కేసును మీద వేసుకొని జైలు కెళ్తాడు. జైలులో అశోక్ చక్రవర్తి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. రెండు రాజకీయ వర్గాల మధ్య జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో ఇరుక్కుపోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓ గ్రూపులో చేరుతాడు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ ( త్యాగరాజన్)కు చేరువ అవుతాడు. అలా ఫ్యాక్షన్ గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పాండుకు ప్రధాన ప్రత్యర్థిగా మారతాడు. తాను హత్య చేసిన దేవరకొండ గాంధీ (విజయ్ ఆంటోని) కుమారుడే అశోక్ చక్రవర్తి అని మంత్రి పాండు తెలుస్తుంది. దాంతో ఓ దశలో అశోక్ చక్రవర్తిని మంత్రి పాండు, మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ హత్య చేయాలని కుట్ర పన్నుతారు. వారి కుట్రలను ఎదురించి ఎన్నికల్లో ఎలా గెలుపొందాడు? దేవరకొండ గాంధీని పాండు ఎందుకు చంపాడు? గాంధీ కుట్రలకు అశోక్ చక్రవర్తి కుటుంబం ఎలా అన్యాయానికి గురైంది? రాజకీయ ప్రత్యర్థులపై అశోక్ ఎలా పగ తీర్చుకున్నాడు. చివరకు ఆయన మంత్రిగా ఎలా మారాడన్నది ఈ సినిమా కథ.
     
    **Note:Hey! Would you like to share the story of the movie యమన్ with us? Please send it to us ([email protected]).
    సంబంధిత వార్తలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X