విమర్శకుల సమీక్ష

  • కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఉన్నప్పుడు లోకాంతర వివాహాలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తూ వచ్చిన చిత్రం ఇది. యముడుకి, మానవుడికి మధ్య జరిగే కలహాల కామెడీలతో ఎన్టీఆర్ 'దేవాంతకుడు' నాటి నుంచి మొన్న 'యమాయ నమహ' వరకూ, ఎన్నో సోషియో ఫాంటసీ చిత్రాలు తెలుగులో వచ్చాయి. అయితే వాటిల్లో యమగోల, యమలీల,యమదొంగ వంటి కొన్ని చిత్రాలు కథ, కథనంలో ప్రత్యేకతను చూపుతూ ఘన విజయం సాధించాయి. అయితే తాజాగా వచ్చిన యముడుకి మొగుడు మాత్రం స్క్రిప్టుపై సరైన శ్రద్ద పెట్టకపోవటంతో నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఫస్టాఫ్ డైలాగులతో ఫన్ చేసి, సెకండాఫ్ బోర్ తో రన్ చేసారు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా డల్ గా పేలవంగా తేలిపోవటం పెద్ద మైనస్ గా మారింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X