TelugubredcrumbMoviesbredcrumbYamudu 3bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఈ సినిమా లో స్పెషాలిటీ ఏమిటంటే సూపర్ ఫాస్ట్ గా నడిచే స్క్రీన్ ప్లే. ఏం జరుగుతోందో అర్దమయ్యే లోగా చాలా సీన్స్ గడిచిపోతాయి. ఎక్కడా లాగ్ కానీ, చిన్న బోరింగ్ మూవ్ మెంట్ కానీ ఉండదు. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్స్, చాలా లౌడ్ గా ఉండే బ్యాగ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ ఆడియన్స్ కు కాస్త ఇబ్బంది పెడతాయి. అయితే సింగం సీరిస్ నిలబెట్టాలంటే ఆ మాత్రం ఉండాలనకున్నట్లున్నాడు దర్శకుడు హరి. ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు ఇవన్నీ కలిసి ఓ యాక్షన్‌ ప్యాకేజీలా దర్శకుడు చూపించాడు.

      మొదటి రెండు భాగాల్లో ముఖ్యంగా మొదటి భాగంలో దర్శకుడు ఎక్కువగా బాగా ఛార్జ్ చేసిన ఎలివేషన్ సీన్స్ ఉండేటట్లు చూసుకుని సక్సెస్ అయ్యాడు. కానీ మూడో పార్ట్ కు వచ్చేసరికి కేవలం కొన్ని సీన్స్ లోనే ఆ ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఎయిర్ పోర్ట్ లో చేసిన సీన్ చాలా హైలెట్ గా నిలిచింది. ఆస్ట్రేలియాలో జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఫస్టాఫ్ కన్నా సెకండాప్ పట్టుగా సాగింది. కాకపోతే దర్శకుడు తొలి రెండు భాగాల్లో చూపించి గ్రిప్ ఈ సినిమాలో చూపించలేకపోయాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X