విమర్శకుల సమీక్ష

  • మొదటి సినిమా 'జోష్' తో నీరసం తెప్పించినా రెండో సినిమాతో పూర్తి స్ధాయి పట్టాలు ఎక్కాడు నాగచైతన్య. సెన్సెటివ్ లవ్ స్టోరీలు తీయటంలో పేరెన్నికగన్న దర్శకుడుగా గౌతం మీనన్ ఈ తాజా చిత్రాన్ని ఓ క్లాసిక్ గా తీర్చిదిద్దాననటంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా విజువల్ ట్రీట్ అన్న పదానికి ఈ చిత్రం అద్దం పట్టేలా తయారైంది. నాగార్జున రీసెంట్ ఇంటర్వూలలో ఈ చిత్రాన్ని గీతాంజలితో పోల్చటం కరెక్టే అనిపిస్తుంది. అయితే కొద్ది స్లో నేరేషన్, డల్ గా ఉన్న పాటలు అక్కడక్కడా పంటి క్రింద రాళ్ళలా ఇబ్బంది పెడతాయి. ఈ చిత్రం ముఖ్యంగా మల్టీఫ్లెక్స్, ఎ సెంటర్స్ లో మంచి విజయం సాధిస్తుంది. యువతకు నచ్చే లవ్ సీన్స్ ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్ ని తెచ్చిపెడతాయనటంలో సందేహం లేదు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X