విమర్శకుల సమీక్ష

  • పెర్ఫార్మెన్స్ పరంగా నాగ చైతన్య... అర్జున్ పాత్రలో బాగా సూటయ్యాడు. తన ఫ్యామిలీని కాపాడుకునే క్రమంలో అతడు చేసిన పనులు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. నాగ చైతన్య, లావణ్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే సినిమా కథ ప్రకారం వీరి రొమాన్స్ పార్ట్ పరిమితం చేయాల్సి వచ్చింది. లావణ్య కనిపించేది కొన్ని సీన్లే అయినా ఉన్నంతలో ఇంప్రెస్ చేసింది. అర్జున్ తండ్రి పాత్రలో రావు రమేష్ మరోసారి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తల్లి పాత్రలో నటి రేవితి సూపర్భ్. అర్జున్, రావు రమేష్, రేవతి మధ్య మచ్చే కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తాయి. విలన్ నాయక్ పాత్రలో శ్రీకాంత్ మెప్పించాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్‌కు వరుస విలన్ ఆఫర్లు రావడం ఖాయం. కమెడియన్ ప్రియదర్శి కనిపించిన రెండు మూడు సీన్లలో తనదైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు. నికేత్ బొమ్మి సినిమాటోట్రఫీ బావుంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఫర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ ఒకే. డేవిడ్ ఆర్.నాథన్, అబ్బూరి రవి అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమా కథలో కొత్తదనం లేదు. రోటీన్ రివేంజ్ డ్రామా. అయితే స్క్రీన్లే కాస్త ఫర్వాలేదు. రోటీన్ గా సాగే కథకు స్లో నేరేషన్ పెద్ద మైనస్‌గా మారింది. ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు లేకుండా సినిమా మరీ ఇంత స్లోగా ఉంటే ప్రేక్షకులు భరించడం కష్టమే. సినిమాలో ఓ సీన్లో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న గర్బవతి ప్రాణాలు కాపాడేందుకు డ్రోన్ ద్వారా రక్తం పంపించి ఆమెను కాపాడే సీన్ సినిమాలో బాగా హైలెట్ అయింది. ఆ సీన్ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X