Don't Miss!
- News
Social Media: 20 ఏళ్ల తర్వాత తల్లితో మాట్లాడిన కూతురు.. పాకిస్థాన్ లో నరకం చూస్తున్నట్లు కన్నీరు..
- Finance
Super Offer: నిద్రపోయినందుకు బోలెడంత జీతం.. కంపెనీ సూపర్ ఆఫర్.. పోటీపడి దరఖాస్తులు..!
- Automobiles
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350తో పోటీపడే ఇతర మోటార్‌సైకిళ్లు ఏవో తెలుసా..?
- Lifestyle
మన జాతీయ జెండా ఏర్పడటం వెనుక ఉన్న చారిత్రక కథ మీకు తెలుసా?
- Sports
Chess Olympiad 2022 ముగింపు వేడుకలకు ధోనీ.. టాప్‌లో హంపీ టీమ్
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
10th Class Diaries సిలక సిలక మాస్ ఐటెమ్‌తో శేఖర్ మాస్టర్ రచ్చ.. హరీష్ శంకర్ చేతుల మీదుగా
టాలీవుడ్‌లో 10th Class Diaries అనే మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం త్వరలోనే రాబోతున్నది. మాస్, మసాల అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి పాపులర్ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మాస్ ఐటెమ్ సొంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. సిలక సిలక అనే పాటను పాపులర్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా విడుదల కావడం విశేషం. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా, యువ రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. యువ హీరొయిన్ అవికా గోర్, శ్రీరామ్ నటించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను పీ అచ్యుత రామారావు, రవితేజ మాన్యం నిర్మించగా, అజయ్ మైసూర్ సమర్పించారు. సిలక సిలక పాట రిలీజ్ సందర్భంగా
నిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ.. నేను నిర్మించిన రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు చిత్రాలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో 10th క్లాస్ డైరీస్ సినిమాను నిర్మించాం. 10th క్లాస్‌లో ఉంటే మధురానుభూతులను మరోసారి గుర్తు చేయబోతున్నాం. మంచి కామెడీ, జీవితంలోని కొన్ని మధురమైన గుర్తులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి అని అన్నారు.

దర్శకుడు అంజి మాట్లాడుతూ.. సిలక సిలక పాటను కాసర్ల శ్యామ్ రాయగా, ఇండియన్ ఐడల్ రేవంత్ పాడారు. ఈ పాటకు సురేష్ బొబ్బిలి అద్బుతమైన సంగీతం అందించారు. ఈ పాటను 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఈ పాట కోసం ముంబై నుంచి ఇద్దరు డ్యాన్సర్లను, మరో 30 మంది డ్యాన్సర్లను రప్పించాం. సినిమాటోగ్రాఫర్‌గా నాకు 50వ సినిమా. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమా టీజర్ గురించి జనవరి 26వ తేదీన సమాచారం అందిస్తాం అని అన్నారు.

నటీనటులు:
శ్రీరామ్,
అవిక
గోర్,
శ్రీనివాస్
రెడ్డి,
వెన్నెల
రామారావు,
అర్చన,
హిమజ,
శివబాలాజీ,
మధుమిత,
సత్యం
రాజేశ్,
భానుశ్రీ,
నాజర్,
శివాజీ
రాజా,
సంజయ్
స్వరూప్,
తాగుబోతు
రమేష్,
చిత్ర
శ్రీను,
గీతా
సింగ్,
జబర్దస్త్
రొహిని
తదితరులు
నిర్మాత:
పీ
అచ్యుత
రామారావు,
రవితేజ
మన్యం
దర్శకత్వం:
సినిమాటోగ్రఫి:
గురుడవేగ
అంజి
సహ
నిర్మాత:
రవి
కొల్లిపార
సమర్పణ:
అజయ్
మైసూర్
కథ:
రామారావు
డైలాగ్స్,
స్క్రీన్
ప్లే:
శృతి
కార్తీక్
సాహిత్యం:
చైతన్య
ప్రసాద్,
కాసర్ల
శ్యామ్,
సురేష్
బొబ్బిలి
కొరియోగ్రఫి:
శేఖర్
వీజే,
విజయ్
బిన్ని,
సన్నీ
ఫైట్స్:
స్టంట్
జాషువా
ఎడిటర్:
ప్రవీణ్
పూడి
బ్యాక్
గ్రౌండ్
స్కోర్:
చిన్నా
మ్యూజిక్:
సురేష్
బొబ్బిలి