Don't Miss!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ఇద్దరి వల్లే నా జీవితంలో కిక్కు.. తమన్ ట్వీట్ వైరల్
టాలీవుడ్లో ఢిఫరెంట్ మ్యూజిక్‌తో ఎస్ థమన్ సరికొత్తగా తన సత్తాను చాటుతున్నారు. తొలిప్రేమ, భాగమతి, అరవింద సమేత లాంటి చిత్రాలతో మ్యూజిక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. తాజాగా తనపై తనకు ఎంతో విశ్వాసం కలిగించిన సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
11 ఏళ్ల క్రితం వచ్చిన కిక్ చిత్రం కంటెంట్ పరంగాను, మ్యూజిక్ పరంగాను మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, మాస్ మహారాజా రవితేజ, గ్లామరస్ హీరోయిన్ ఇలియానా కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్ర సినిమా ప్రేక్షకుల మంచి వినోదాన్ని పంచింది.
ఎన్నో విశేషాలను సొంతం చేసుకొన్న కిక్ సినిమా 11 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం గురించి తమన్ ట్వీట్ చేస్తూ.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి అంటే చెప్పలేనంత ప్రేమ. అాగే రవితేజ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. వారిద్దరి వల్ల నాకు చాలా నమ్మకం కలిగింది. నాకు అన్ని వేళలాప్రేమను, నమ్మకాన్ని పంచిన వారిద్దరికి.. నా కెరీర్లో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వారికి రుణపడి ఉంటాను. వారి వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నాను. ఇక త్వరలో రాబోతున్న క్రాక్ సినిమా మ్యూజిక్ మరో లెవెల్లో ఉంటుందని హామీ ఇస్తున్నాను అని తమన్ ట్వీట్ చేశారు.
రవితేజ్ నటించిన క్రాక్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.