SP Balasubrahmanyam: బాలుకి ప్రేమతో బిగ్గెస్ట్ ఈవెంట్.. రంగంలోకి 100 మంది సింగర్స్!

గాన గంధర్వుడు ప్రపంచం మెచ్చిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లి పోయినప్పటికీ కూడా ఆయన మధురమైన పాటలు నిత్యం అందరినీ పలకరిస్తూనే ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో ఆయన కు సంబంధించిన పాటలు ప్రతి ఒక్కరి మనసులో కూడా మెదులుతూనే ఉంటాయి. బాలసుబ్రమణ్యం భౌతికంగా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లి పోయినప్పటికీ కూడా ఆయన పాటలతో మాత్రం సంగీత ప్రపంచంలో బతికే ఉంటారని చెప్పవచ్చు.

ఇక సంగీతానికి సంబంధించిన ఎలాంటి వేడుకలు జరిగిన కూడా చాలామంది సంగీత గాయకులు బాలసుబ్రహ్మణ్యంను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే జూన్ 4వ తేదీన తెలుగు సినిమా మ్యూజిషియన్స్ యూనియన్ వారు ప్రత్యేకంగా ఒక వేడుకను నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన విశేషాలను ఒక వీడియో ద్వారా తెలియజేశారు.

12hr non stop musical tribute to the legend SP Balasubrahmanyam on June 4th

బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ 4వ తేదీన రవీంద్రభారతిలో బాలుకి ప్రేమతో అనే వేడుకను నిర్వహించబోపోతున్నట్లు తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా కొనసాగే ఈ సంగీత వేడుకల్లో దాదాపు 100 మంది గాయకులు పాల్గొనబోతున్నట్లుగా సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్ తెలియజేశారు.

అలాగే యూనియన్ సభ్యులు కూడా వేడుక గురించి ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. గతంలోనే బాలసుబ్రహ్మణ్యం గారిని నివాళులర్పించే విధంగా వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని అనుకున్నప్పటికీ కరోనా పరిస్థితుల ప్రభావం వలన కుదరలేదు అని అందుకే ఇప్పుడు భారీ స్థాయిలో బాలుకి ప్రేమతో అనే ఈవెంట్ ను నిర్వహించబోతున్న ట్లుగా వివరణ ఇచ్చారు.

అలాగే గాయకులు శ్రీరామచంద్ర కూడా ఈ వేడుక గురించి వివరణ ఇవ్వడమే కాకుండా మ్యూజిక్ అసోసియేషన్ చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి కూడా తెలియజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు ఆర్పీ పట్నాయక్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈవెంట్ కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక రవీంద్రభారతిలో జరగబోయే ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొనాలి అని కూడా వారు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X