For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2021 Special: హాట్ షోతో షాకిచ్చిన హీరోయిన్లు వీళ్లే.. సమంత ఘాటుగా.. అనసూయ, మోనాల్ డోస్ పెంచేసి!

  |

  2020తో పోలిస్తే ఈ సంవత్సరం కొన్ని ఎక్కువ సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సెకెండ్ వేవ్ కోసం లాక్‌డౌన్ విధించినా.. ఆ తర్వాత కొన్ని భారీ చిత్రాలు రావడంతో బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకుంది. అంతేకాదు, కొన్ని భారీ హిట్ చిత్రాలు రావడంతో టాలీవుడ్‌లో కాసులు గళగళలాడాయి. దీంతో ఈ ఏడాది పూర్తయ్యే సరికి పరిస్థితి కొంచెం సర్దమణిగినట్లే కనిపించింది. ఇక, ఈ ఏడాది ఎన్నో సినిమాలు విడుదల కాగా.. అందులో కొన్ని మాత్రం ప్రత్యేకతను చాటుకున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు భామలు స్పెషల్ సాంగ్‌లతో రచ్చ రచ్చ చేసేశారు. ఇక, 2021 ముగుస్తోన్న సమయంలో ఈ ఏడాది పాపులర్ అయిన స్పెషల్ సాంగ్‌ల గురించి తెలుసుకుందాం పదండి!

  డించక్ డించక్ అనిపించిన హెబ్బా

  డించక్ డించక్ అనిపించిన హెబ్బా

  కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తెరకెక్కించిన చిత్రం 'రెడ్'. ఈ సినిమాను స్ర‌వంతి ర‌వికిషోర్ సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఇది కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇందులో 'డించక్ డించక్' అంటూ సాగే ఓ ఐటమ్ సాంగ్ పాపులర్ అయింది. ఇందులో హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ రచ్చ చేసేసింది.

  Bigg Boss: మరో బాంబ్ పేల్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్‌కు బిగ్ షాక్.. విడిపోతున్నట్లు చెప్పేసిందా!

  రంభ, ఊర్వశి, మేనక దిగదుడుపేలే

  రంభ, ఊర్వశి, మేనక దిగదుడుపేలే

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రమణ్యం నిర్మించిన ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా చేశారు. ఇక ఇందులో 'రంభ ఊర్వశి మేనక' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో బిగ్ బాస్ ఫేం మోనాల్ గజ్జర్ అందచందాలతో సందడి చేసింది.

  భూమ్ బద్దల్ అంటూ అప్పర స్టెప్స్

  భూమ్ బద్దల్ అంటూ అప్పర స్టెప్స్

  సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం 'క్రాక్'. ఠాగూర్ మధు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, ఈ సినిమాలో 'భూమ్ బద్దల్' అంటూ సాగే ఓ ఐటమ్ ఉంది. ఇందులో అప్సరా రాణి తన అందచందాలతో రచ్చ చేసింది. దీంతో ఈ పాట యమ పాపులర్ అయిపోయింది.

  సుధీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు: షేక్ హ్యాండ్ ఇస్తే అంతే సంగతులు.. దూరంగా ఉండమంటూ ఘోరంగా!

  పైన పటారం అని అనసూయ రచ్చ

  పైన పటారం అని అనసూయ రచ్చ


  యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. ఈ చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దీన్ని బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ చిత్రంలో 'పైన పటారం లోన లొటారం' అంటూ సాగే ఓ స్పెషల్ నెంబర్ ఉంది. ఇందులో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తనదైన శైలి గ్లామర్ అండ్ స్టెప్పులతో అదరగొట్టేసింది.

  సీటీమార్ కొట్టించేసిన పెస్సీ ఆంటీ

  సీటీమార్ కొట్టించేసిన పెస్సీ ఆంటీ


  గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. దీన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్‌గా నటించగా.. భూమిక కీలక పాత్రను పోషించింది. ఇందులో 'పెప్సీ ఆంటీ' అంటూ సాగే ఐటమ్ సాంగ్ ఉంది. ఈ పాటలో కూడా అప్సరా రాణి ఆడిపాడింది. ఇందులో ఆమె గ్లామర్, డ్యాన్స్ బాగా ఆకట్టుకున్నాయి.

  Arjuna Phalguna Twitter Review: శ్రీవిష్ణు మూవీకి షాకింగ్ టాక్.. ఒక్కటే ప్లస్.. ఫైనల్ రిపోర్ట్ ఇదే

  మందులోడా అంటూ సందడి చేసి

  మందులోడా అంటూ సందడి చేసి


  టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఇందులో 'మందులోడా' అంటూ సాగే ఐటమ్ సాంగ్ ఉంది. ఇందులో స్నేహా గుప్తా అనే అమ్మాయి రచ్చ చేసేసింది.

  Recommended Video

  Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu
  ఊ అంటావా మావ.. ఊఉ అంటావా

  ఊ అంటావా మావ.. ఊఉ అంటావా

  అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'పుష్ప'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే, ఇందులో మరో స్టార్ హీరోయిన్ సమంత 'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా' అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇది ఈ ఏడాదిలోనే కాదు.. ఆల్‌టైం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే.

  English summary
  In 2021 so many movies released in the Telugu Film industry. Let's Know about Tollywood Popular Item Songs In This Year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X