twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2022 Best Songs: ఆ నాలుగు పాటలకు దద్దరిల్లిన తెలుగు రాష్ట్రాలు.. థమన్ డబుల్ హిట్!

    |

    ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ఎన్నో విభిన్నమైన సినిమాలు వచ్చాయి. ఇక అందులో సాంగ్స్ తో ఆకట్టుకున్న సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక 2022లో బెస్ట్ సాంగ్స్ లిస్టు కూడా చాలా పెద్దగానే ఉంది. అయితే అందులో నాలుగు పాటలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోయాయి. అందులో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సాంగ్స్ తో పాటు RRR కు సంబంధించిన ఒక సాంగ్ కూడా ఉంది. ఇక DJ టిల్లు చిత్రంలోని సాంగ్ కూడా బాగా వైరల్ అయింది. ఇక ఆ టాప్ ఫోర్ సాంగ్స్ లిస్టులోకి వెళితే..

    నెంబర్ వన్ నాటు నాటు

    నెంబర్ వన్ నాటు నాటు

    2022లో బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని పెద్ద సినిమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేశాయి. ముఖ్యంగా RRR సినిమాలోని ప్రతి పాట కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక అందులో జనాలను ఎక్కువగా ఆకట్టుకున్న పాట మాత్రం నాటు నాటు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ వారి స్టైల్ కు తగ్గట్టుగా కలిసి చేయడం, కీరవాణి కూడా అదిరిపోయేలా మ్యూజిక్ ఇవ్వడం అన్ని వర్గాల వారిని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. యూట్యూబ్ లో కూడా నెల రోజులపాటు ఈ పాట ట్రెండ్ అయింది.

    లాలా భీమ్లా ట్రెండింగ్

    లాలా భీమ్లా ట్రెండింగ్

    అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలోని ప్రతిపాట కూడా బాగానే ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా లాలాబీమ్ల అనే పాట ఊహించని రెస్పాన్స్ అందుకుంది. తమన్ కంపోజిషన్ లో వచ్చిన ఈ పాట ఒక విధంగా ఒరిజినల్ సాంగ్ కంటే ఎక్కువ స్థాయిలో ఆకట్టుకోవడం విశేషం. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ పాట మంచి బూస్ట్ ఇచ్చింది. అంతేకాకుండా థమన్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకునేందుకు కూడా ఈ పాట ఉపయోగపడింది.

    మహేష్ కళావతి

    మహేష్ కళావతి

    ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా కళావతి అనే లిరికల్ సాంగ్ సినిమాకు హై రేంజ్ లో రెస్పాన్స్ తీసుకువచ్చింది. ఆ పాట యూట్యూబ్లోనే కాకుండా ఇతర మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా ఎక్కువమందిని ఆకట్టుకుంది. అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న పాటలలో కళావతి కూడా టాప్ లిస్టులో ఉంది. అంతేకాకుండా సర్కారు వారి పాట ఫుల్ ఆల్బమ్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది.

    దద్దరిల్లిన డీజే టిల్లు

    దద్దరిల్లిన డీజే టిల్లు

    ఇక పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా అదే తరహాలో రెస్పాన్స్ అందుకుంది. ఈ సాంగ్ ప్రతి పార్టీలో కూడా హైలెట్గా నిలిచింది అని చెప్పాలి. తర్వాత యూట్యూబ్ లోనే వివిధ రకాల వెర్షన్స్ కూడా రావడంతో వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో మరి కొన్ని పాటలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లో ఈ పాట 219 మిలియన్స్ వ్యూవ్స్ అందుకోవడం విశేషం.

    English summary
    2022 Most Trended Telugu Songs Of The Year and top list viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X