యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తున్న సిద్ శ్రీరామ్.. బ్లాక్‌బస్టర్‌గా శేఖర్ చంద్ర మ్యూజిక్.. ఆ పాట వినాలని ఉందా?

టాలీవుడ్‌లో మెలోడి పాటలతో ఆకట్టుకొనే మ్యూజిక్ డైరెక్టర్లలో శేఖర్ చంద్ర అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో హిట్స్ సాంగ్స్ ఇస్తూ తనకంటూ అభిమానులను సొంతం చేసుకొన్నారు. తాజాగా ఊరు పేరు భైరవ కోన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యహరిస్తున్నారు. ఈ సినిమా కోసం అందించిన నిజమే నే చెబుతున్నా అనే పాట యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్నది. ఈ పాట సృష్టిస్తున్న సంచలనం వివరాల్లోకి వెళితే..

సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నిజమే నే చెబుతున్నా పాటను సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర కంపోజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు.

30 million views for Nijame Ne Chebutunna song of Ooru Peru Bhairavakona Youtube: Sid Sriram and Shekar Chandra combo Super Hit

నిజమే నేను చెబుతున్నా పాటకు య్యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ అందుకొన్నది. ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభించింది. దాదాపు ఈ పాట య్యూట్యూబ్‌లో 30 మిలియన్ల వ్యూస్ అంటే 3 కోట్లకుపైగా వ్యూస్ సాధించడం విశేషంగా మారింది. ఇంకా భారీగా వ్యూస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఊరు పేరు భైరవకోనలోని నిజమే నే చెబుతున్నా పాట కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా ఇన్స్‌టాగ్రామ్‌లో సందడి చేస్తున్నది. ఈ పాటకు సంబంధించిన రీల్స్ కూడా భారీగా వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ పాట అన్ని వర్గాలను ఆకట్టుకోవడంపై చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నది.

నిజమే నే చెబుతున్నా పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంపై మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర స్పందిస్తూ.. నేను కంపోజ్ చేసిన పాటకు ఇంత పెద్ద హిట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ పాటను సంగీత ప్రియులు, అభిమానులు తమ పాటగా సొంతం చేసుకొని రీల్స్‌ సృష్టిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ పాటను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్. దర్శకుడు వీఐ ఆనంద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా మంది ఈ పాట గురించి మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు అని అన్నారు.

నిజమే నే చెబుతున్నా పాట ఇస్తున్న ఆనందంతో భవిష్యత్‌లో మంచి పాటల చేయాలనే కోరిక మరింత బలపడింది. ఈ అవకాశం ఇచ్చిన సందీప్ కిషన్, ఈ పాటను అద్బుతంగా పాడిన సిద్ శ్రీరాం థ్యాంక్స్. శ్రీమణి సాహిత్యం బాగున్నది. ఈ కాంబినేషన్‌తో రానున్న రోజుల్లో మంచి పాటలతో మీ ముందుకు వస్తాం అని సిద్ శ్రీరాం అన్నారు.

శేఖర్ చంద్ర ,సిద్ శ్రీరామ్ కాంబినేషన్‌లో బాగుంటుంది నువ్వు నవ్వితే, ప్రియతమా ప్రియతమా, మనసు దారి తప్పేనే లాంటి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన నాలుగో పాట ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శేఖర్ చంద్ర 'నిజమే చెబుతున్నా" సాంగ్ వైరల్ అవుతూ మ్యూజిక్ లవర్‌ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాంగ్ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X