90ml song released: క్రేజీగా అద్నాన్ సమీ పాట.. కార్తీకేయ స్టెప్పులు
RX 100 సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సందడి చేసిందో అందరికీ తెలిసిందే. న్యూవేవ్ సినిమా, కల్ట్ మూవీగా భారీ విజయాన్నిసొంతం చేసుకుని సినీ అభిమానుల గుండెల్లో పదిలంగా చోటుచేసుకుంది. విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న చిత్రాన్ని కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ తెరకెక్కించింది. ఆ చిత్రం ద్వారా హీరో కార్తికేయకు గొప్పగా గుర్తింపు లభించింది. అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వస్తున్న చిత్రం 90ml. ఈ చిత్రంలో కార్తికేయ సరసన నేహా సోలంకి నాయికగా నటిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నాతో నువ్వుంటే చాలూ.. కోరుకోను ఇంకేమీ వరాలు వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు.
ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం వహించిన ఈ చిత్రంలోని నాతో నువ్వుంటే చాలూ అనే పాటను ప్రముఖ గాయకుడు అద్నాం సమీ పాడటం విశేషం.

ప్రముఖ గేయ రచయిత చంద్రబోసు రాసిన పాట.. ఒకసారి చూస్తే చాలూ..
ఒకసారి నవ్వితే చాలూ..
ఒక అడుగు వేస్తే నాతో వేస్తే చాలూ
ఒక రిప్లై ఇస్తే చాలూ..
ఒక స్మైలీ పెడితే చాలూ
ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలూ..
నాతో నువ్వుంటే చాలూ..
కోరుకోను ఇంకే వరాలు అంటూ సాగింది.
నాతో నువ్వుంటే చాలూ విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో మంచి స్పందనను సొంతం చేసుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఇటీవలే అజర్ బైజాన్‌లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే.
నటీనటులు:
కార్తికేయ, నేహా సోలంకి (తొలి పరిచయం), రవికిషన్, రావు రమేశ్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, కాలకేయ ప్రభాకర్ , సత్యప్రకాశ్, ప్రగతి, ప్రవీణ్, అదుర్స్ రఘు, నెల్లూర్ సుదర్శన్, తాగుబోతు రమేశ్, రోల్స్ రిడా, దువ్వాసి మోహన్, సంజయ్ స్వరూప్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
రచన-దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్ర
సంగీతం: అనూప్ రూబెన్స్
పాటలు: చంద్రబోస్
కెమెరా: జె.యువరాజ్
ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్
ఆర్ట్: జీఎం శేఖర్
ఫైట్స్: వెంకట్
నృత్యాలు: ప్రేమ్ రక్షిత్, జానీ
కో డైరక్టర్: సిద్ధార్థ్ రెడ్డి గూడూరి
ప్రొడక్షన్ కంట్రోలర్: కె. సూర్య నారాయణ


Click it and Unblock the Notifications











