A. R. Rahman ఇళయరాజా హ్యాపీ మూమెంట్.. ఎక్కడికి వెళ్లినా మళ్ళీ ఒకే చోటుకు అంటూ.. రెహమాన్ వీడియో!
ఇద్దరు సంగీత స్వరకర్తలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే సంగీత ప్రియులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రీసెంట్ గా ఏఆర్ రెహమాన్ అలాగే ఇళయరాజా ఒక వీడియోలో కనిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకున్న ఈ ఇద్దరు అగ్ర సంగీత దర్శకులుగా ఎంతగా క్రేజ్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైమరిచిపోయే విధంగా సంగీతం అందించడంలో ఈ ఇద్దరి స్టైల్ వేరు.
ముందుగా ఇళయరాజా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే హాలీవుడ్లో సైతం తన సంగీతాన్ని అందించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నారు. ఇక ఇళయరాజా అనుభవానికి రెహమాన్ ఎప్పుడూ కూడా అభిమానిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రీసెంట్ గా ఈ ఇద్దరు ఇతర దేశాలలో నిర్వహించిన మ్యూజిక్ ఈవెంట్స్ పూర్తి చేసుకుని ఒకే దగ్గర కలుసుకోవడం విశేషం.
ఇక ప్రత్యేకంగా వీరు ట్రావెల్ చేస్తున్న ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. ఆ వీడియోను ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం విశేషం. మేము వివిధ ఖండాల నుండి తిరిగి వస్తున్నాము .. కానీ గమ్యం ఎల్లప్పుడూ తమిళనాడు ఒక్కటే అంటూ ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లో డివైరల్ గా మారిపోయింది. అందులో ఇళయరాజా ఏఆర్ రెహమాన్ ఇద్దరు కూడా నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు.

ఇద్దరు సరస్వతీపుత్రులను ఓకే చోట చూసినట్లు ఉంది అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక మరోవైపు రెహమాన్ అతిపెద్ద సినిమాలతో బిజీగా ఉండగా ఇళయరాజా కూడా భాషతో సంబంధం లేకుండా ఎనిమిది పదుల వయసులో ఇంకా అదే తరహాలో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు వీరికి వివిధ దేశాల నుంచి మంచి గౌరవం కూడా లభిస్తుంది. ప్రత్యేకంగా మ్యూజికల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ వారి సంగీత అభిరుచిని తెలియజేస్తున్నారు. ఇక రెహమాన్ త్వరలోనే ఒక టాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాకు కూడా సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











