రెండో పాటతో సందీప్ కిషన్ రచ్చ..ప్రమోషన్స్ జోరు పెంచిన ఏ1 ఎక్స్‌ప్రెస్
సందీప్ కిషన్ లావణ్య త్రిపాఠిల కాంబోలో రాబోతోన్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌పై అంచనాలు మామూలుగా లేవు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లావణ్య, సందీప్ కిషన్ ఇద్దరూ కూడా హిట్టు కొట్టేసి ఉన్నారు. తెనాలి రామకృష్ణ సినిమాతో సందీప్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. అర్జున్ సురవరం సినిమాతో లావణ్య మంచి హిట్ కొట్టేసింది.
అలా ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ మూవీ విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట బాగానే క్లిక్ అయింది. సింగిల్ కింగులం అంటూ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మళ్లీ ఇన్ని రోజుల తరువాత రెండో పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.

హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ నుంచి రెండో పాటను ఫిబ్రవరి 10న ఉదయం పది గంటలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. అమిగో అంటూ సాగే ఈ లిరికల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. సింగిల్ కింగులం పాటకు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు.. ఇప్పుడు మరో పాటను మీ ముందుకు తెస్తున్నామంటూ సందీప్ కిషన్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











