అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇక సెన్సేషనే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో బిగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోవడానికి సిద్ధమవుతోంది. మొన్నటి వరకు ఈ కాంబినేషన్ గురించి గాసిప్స్ మాత్రమే వస్తుండగా ఇక ఏకంగా ఈరోజు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఒక బిగ్ అప్డేట్ అందించారు. అల్లు అర్జున్ 22వ సినిమా అట్లీ ఆరవ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఏ రేంజ్ లో జరుగుతున్నా యో తెలియజేసేలా ఒక ఎనర్జిటిక్ వీడియోను విడుదల చేశారు. దాంతో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అట్లీ దర్శకత్వ ప్రతిభకు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ పర్ఫామెన్స్ తోడైతే బాక్స్ ఆఫీస్ బద్దలేనని ఇప్పటికే అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టుకు సంబంధించిన మేకర్స్ విడుదల చేసిన వీడియోతో ఇక అంచనాలు ఆకాశాన్నంటాయి. ఏకంగా ఈ ప్రాజెక్టును హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేందుకు మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లను దింపడంతో ఒక్కసారిగా ఇండియన్ మొత్తం షేక్ చేశారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూకు సంబంధించిన వివరాలపై అభిమానులు, ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా మాత్రం ఈ భారీ ప్రాజెక్టుకు సంగీతం అందించబోతున్నా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ గ్రాండ్ విజువల్స్ తో రాబోతున్న ప్రాజెక్టుకు తమిళ యంగ్ మ్యూజిక్ కంపోజర్ సాయి అభ్యాంకర్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈయన ఇప్పటివరకు సంగీతం అందించిన చిత్రాలు లేవు.
సాయి అభ్యాంకర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం పలు చిత్రాలకు వర్క్ చేస్తున్నారు. అందులో తమిళ చిత్రాలు బెంజ్, సూర్య 45, ప్రదీప్ రంగనాథన్ 4వ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ ఈయన ఇస్కోగ్రఫీతో మాత్రం ఇండియన్ షేక్ చేశారు. తమిళంలో వచ్చిన సింగిల్స్ katchi sera, Aasa Kooda, Sithira Puthiri వంటి మ్యూజిక్ వీడియోస్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశాయి. యూట్యూబ్లో ఇప్పటికీ మిలియన్ల కొద్ది వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి.
కట్చి సెర సాంగ్ ఏకంగా 227 మిలియన్ల వ్యూస్ ను తగ్గించుకోవడం రికార్డును క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు అట్లీ నీ సాయి అభ్యాంకర్ ఆకర్షించగలిగాడు. యంగ్ టాలెంట్ను ప్రోత్సహించే అట్లీ అతనికి అవకాశం ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ సినిమాలకు ఎక్కువగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉంటారు. ఇక ఈ ప్రాజెక్టుకు మాత్రం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యాంకర్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కు సన్ పిక్చర్స్ నిర్మాతలు 800 కోట్ల బడ్జెట్ ను వెచ్చించబోతున్నారని తెలుస్తోంది. అవేంజర్స్, స్పైడర్ మ్యాన్, అక్వామెన్, ఐరాన్ మెన్ వంటి చిత్రాలకు వీఎఫ్ ఎక్స్ అందించిన వరల్డ్ టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రంతో అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











