ఆది సాయి కుమార్ ‘శశి’ నుంచి రెండో పాట.. మరోసారి మత్తెక్కించేందుకు రెడీ

ఆది సాయి కుమార్‌ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఓ హిట్ కొట్టలేకపోతున్నాడు. పేరు మార్చుకున్నాడు.. ప్రయోగాలు చేస్తున్నాడు.. కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు.. కానీ ఓ సరైన సక్సెస్ మాత్రం పలకరించడం లేదు. అలా ఆది సాయి కుమార్ ఇప్పుడు శశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లొ వరించిన విజయాలు ఇప్పుడు కనుచూపు మేరకు కనిపించకుండాపోయాయి.

మామూలుగా ఓ సినిమా విడుదల కంటే ముందుగానే ట్రెండ్ అవ్వాలంటే ఆడియో బాగుండాలి. టీజర్, ట్రైలర్ వంటివాటితో హైప్ క్రియేట్ చేయాలి. మామూలుగా పాటలు బాగుంటే మాత్రం సినిమాపై అందరికీ అంచనాలు పెరిగిపోతాయి. అలా శశి సినిమాపై ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ అయింది. శశి సినిమా నుంచి వదిలిన మొదటి పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ఒకే ఒక లోకం నువ్వే అంటూ వచ్చిన పాట శశి సినిమాను సోషల్ మీడియాలో బాగానే నిలబెట్టేసింది.

Aadi Sai kumar Sasi Second single on 5th February

అయితే ఇప్పుడు మరోసాటతో మత్తెక్కించేందుకు శశి యూనిట్ రెడీ అయింది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేయించబోతోన్నట్టు ప్రకటించారు. దీంతానా దీంతానే అంటూ సాగే ఈ పాటను ఫిబ్రవరి 5న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. మరి ఈ పాట కూడా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X