twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెలు కరిగించే సమంత ట్వీట్.. ఆమె చెప్పింది నిజమే

    |

    అక్కినేని సమంత ప్రధాన పాత్రలో రాబోతున్న కొత్త సినిమా 'ఓ బేబీ'. డిఫెరెంట్ కథాంశంతో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత జతగా యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా చిత్రంలోని 'ఆకాశం లోన' అనే లిరికల్ సాంగ్ విడుదల చేసి ఆకట్టుకున్నారు.

    Aakshamlona Song Released From Samanthas O Baby

    లక్ష్మీ భూపాల్ సాహిత్యం అందించిన ఈ పాటను నూతన మోహన్ ఎంతో అద్భుతంగా ఆలపించారు. 'ఆకాశంలోన ఏకాకి మేఘం శోఖానిదా వాన' అంటూ సాగిపోతున్న ఈ ఎమోషనల్ లిరికల్ సాంగ్ ప్రతీ ఒక్కరి మనసును హత్తుకుంటోంది. ఈ పాటను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సమంత.. 'ఇది ఖచ్చితంగా మీ గుండెలను కరిగిస్తుంది' అని ట్వీట్ చేసింది. ఓ బేబీ చిత్రంలో సమంత ఛాలెంజింగ్ రోల్ లో నటించింది.

    'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి తెలుగు రీమేక్‌గా 'ఓ బేబీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 70 ఏళ్ల ముసలావిడ హావభావాలు పండించే 23 ఏళ్ల పడుచు పిల్లగా సామ్ రోల్ చిత్రానికే పెద్ద ఎసెట్. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జులై 5 వ తేదీన భారీ అంచనాల నడుమ ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Samantha Akkineni's latest movie O Baby which is directed by B. V. Nandini Reddy. Yesterday from this movie Aakshamlona Lyrical song is released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X