ఆపద్బాంధవుడు తర్వాత మళ్ళీ విశ్వంభర మూవీకే.. వైరల్‌గా చిరంజీవి, కీరవాణి వీడియో!
తెలుగు సినిమా గర్వించదగ్గ అతి కొద్ది మంది దిగ్గజ స్టార్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మరి మెగాస్టార్ చిరు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ హీరోగా కూడా పేరు తెచ్చుకోగా చిరు రియల్ లైఫ్ లో కొన్ని కొన్ని పనులు తన పాత రోజులని గుర్తు చేసుకుంటూ చెప్పే మాటలు నేటి తరానికి ఎంతో ప్రేరణగా కనిపిస్తూ ఉంటాయి. ఆరోజుల్లో తన డెడికేషన్ కానీ సినిమా వర్క్స్ ఎలా ఉండేవి అనేవి చిరు ఇప్పటికీ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు.
అలా ఇప్పుడు తన బీహార్ చిత్రం "విశ్వంభర" కి కూడా తన పాత సినిమా స్టైల్ ని మళ్ళీ రీ క్రియేట్ చేస్తున్నట్టుగా నేడు రివీల్ చేశారు. కాగా చిరంజీవి అంటే కేవలం ఒక మాస్ హీరోగానే కాకుండా నటుడుగా కూడా చాలా చిత్రాలు అసలు చిరంజీవి అంటే ఏంటో చూపించాయి. అలా తాను చేసిన కొన్ని క్లాసిక్ చిత్రాల్లో దిగ్గజ దర్శకులు కె విశ్వనాధ్ తెరకెక్కించిన ఆణిముత్యం లాంటి సినిమా "ఆపద్భాందవుడు" కూడా ఒకటి.

1992 లో వచ్చిన ఈ సినిమాలో చిరు నటన కానీ తన హావభావాలు, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ ఎంతగానో కట్టి పడేస్తాయి. వీటితో పాటుగా విశ్వనాధ్ గారి అభిరుచి తగ్గట్టుగా ఇచ్చిన పాటలు అయితే మరింత అమోఘం. కాగా ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి అద్భుతమైన ఆల్బమ్ ని అప్పుడు అందించారు. అయితే మళ్ళీ ఇప్పుడు విశ్వంభర కి చిరు కీరవాణితో కలిసి పని చేస్తుండగా ఆ సినిమా నాటి జ్ఞ్యాపకాలు చిరు నెమరు వేసుకున్నారు.
ఆ చిత్రానికి నేను సినిమా యూనిట్ సభ్యులు కీరవాణి కలిసి సంగీత దర్శకుడు పాటలు పాడుతూ ఉంటే అందరికి నచ్చితేనే పాటలు ఫైనల్ అయ్యేవి అని ఇప్పుడు మళ్ళీ ఆ తరహా సెటప్ అంతా విశ్వంభర కే వేసాం అని పాత సంప్రదాయాన్ని ఈ చిత్రంతో మళ్ళీ మొదలు పెట్టడం ఆనందంగా ఉందని కీరవాణి పుట్టినరోజు సందర్భంగా చిరు తన మార్క్ లో విషెష్ తెలిపారు.
దీనితో అప్పుడు ఆపద్భాందవుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు విశ్వంభర కే జరిగినట్టుగా తెలియజేసారు. కాగా ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా త్రిష చిరు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యువ నటి ఆషిక రంగనాథ్, రఘువరన్ బీటెక్ ఫేమ్ సురభి పురాణిక్ తదితరులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టి డబ్బింగ్ షూటింగ్ రెండు ఒకేసారి చేస్తామని తెలిపారు. ఇలా మొత్తంగా సినిమాని అయితే రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకి సన్నద్ధం చేస్తున్నట్టుగా యూవీ క్రియేషన్స్ వారు ఫిక్స్ చేసేసారు.


Click it and Unblock the Notifications











