ఆచార్య నుంచి మరో సర్ ప్రైజ్.. చిరు స్టైల్‌కు ఫిదా

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా నేడు సర్ ప్రైజ్‌ల మీద సర్ ప్రైజ్‌లు వస్తున్నాయి. ఉదయం పూట ఆచార్య నుంచి అదిరిపోయే పోస్టర్ వచ్చింది. రామ్ చరణ్, చిరంజీవి కలిసి వస్తోన్న స్టిల్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిద్ద పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆచార్య టీం రిలీజ్ చేసింది. అయితే తాజాగా మరో సర్ ప్రైజ్‌ను మెగా ఫ్యాన్స్‌కు ఇచ్చారు.

ఆచార్య సినిమాకు సంబంధించి మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ కొట్టాడని టాక్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి చేసే ట్వీట్లు, ఆచార్య మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి ఆయన చెప్పే విశేషాలు అందరిలోనూ హైప్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఆ హైప్‌ను మించిపోయేలా ఓ పోస్టర్ అప్డేట్ వచ్చింది. ఇందులో చిరు గ్రేస్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

Acharya First Single laahe laahe on 31st march

ఆచార్య నుంచి మొదటి పాట అయిన లాహే లాహే అనే ఫస్ట్ సింగిల్‌ను మార్చి 31న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. మార్చి 31న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేయనున్నామని ఆచార్య యూనిట్ ప్రకటించింది. వింటేజ్ చిరంజీవిని చూపిస్తామని మాటిచ్చాం.. ఆ మాటను నిలబెట్టుకుంటాం.. అని రామ్ చరణ్ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. మొత్తానికి సినిమాలో చిరు తరహా స్టెప్పులు ఉండబోతోన్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X