‘ఆచార్య‘ చిరంజీవి సరికొత్త రికార్డు.. మెగాస్టార్ ప్రభంజనానికి ఆరంభమేనా!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక సాంగ్ తో మెగాస్టార్ అంచనాల డోస్ పెంచేశారు.
మణిశర్మ స్వరపరిచిన లాహే లాహే సాంగ్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. రామజోగయ్య శాస్త్రి రాసిన ఆ పాట ఇప్పుడు అన్ని వర్గాల ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది. అందుకే చాలా ఈజీగా మిలియన్ల వ్యూవ్స్ ను అందుకుంటోంది. ఇప్పటికే 20మిలియన్ల వ్యూవ్స్ తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ సెకండ్ వెర్షన్ వీణ స్టెప్ కూడా ఆడియెన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది.

ఒక విధంగా జస్ట్ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో మరిన్ని కమర్షియల్ సాంగ్స్ రాబోతున్నాయట. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ చేసే పాట కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. ఇక మొదటి సాంగ్ తోనే ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది అంటే మెగా స్టార్స్ చేయబోయే అసలైన సాంగ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే మరొక కొత్త డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











