Laahe Laahe Mega Promo.. మణిశర్మ మ్యాజిక్.. చిరు గ్రేస్ అదుర్స్.. అదే హాట్ టాపిక్
మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది డ్యాన్సులే. తెలుగు సినీ చరిత్రలో డ్యాన్స్ అంటే ముందుగా చెప్పుకునేది.. చెప్పుకోవాల్సింది కూడా చిరంజీవి గురించే. మూసధోరణిలో పోతోన్న సినిమాలను, పాటలను, స్టెప్పులను తన రాకతో యూటర్న్ తిప్పేశాడు. అలా డ్యాన్సుల్లో చిరంజీవి తన ముద్రను వేశాడు. ఆరు పదుల వయసు దాటినా కూడా చిరంజీవిలో గ్రేస్, స్టైల్ తగ్గలేదు. తాజాగా మరోసారి ఆ విషయం ప్రూవ్ అయింది.

ఆచార్య కోసం..
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ దుమ్ములేపేశాడు. కానీ సైరా సినిమాలో మాస్‌కు కావాల్సిన అంశాలను జొప్పించలేకపోయారు. హీరోయిజం, పాటలు, డ్యాన్సులకు సైరాలో చోటు లేదు. అందుకే ఆ గ్యాప్‌ను ఆచార్యతో పూర్తి చేసేయాలని ఫిక్స్ అయ్యారు.

చాలా ఏళ్ల తరువాత..
ఆచార్య సినిమాను ఫక్తు కమర్షియల్, మాస్ ఎంటర్టైనర్‌గా తీర్చి దిద్ది ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వాలని కొరటాల శివ ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే చాలా ఏళ్ల తరువాత మణిశర్మ చిరంజీవి కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చారు. మణిశర్మ మాస్, మెలోడీ స్టెప్పులకు చిరు వేసిన ఐకానిక్ స్టెప్పులు ఇండస్ట్రీ ఉన్నంత వరకు నిలిచే ఉంటాయి.

స్పెషల్ ట్యూన్స్..
ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి కోసం స్పెషల్ ట్యూన్స్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటి పాటను వదిలి తెలుగు ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇద్దామని ఆచార్య టీం ఫిక్స్ అయింది. ఈ క్రమంలో మొదటి పాట అయిన లాహే లాహేను రేపు విడుదల చేయబోతోన్నట్టు మార్చి 27న ప్రకటించేశారు.

ప్రోమోతో హైప్..
ఆచార్య నుంచి లాహే లాహే పాట రేపు విడుదల కాబోతోండగా దానికి సంబంధించిన ప్రోమోను ఇప్పుడు వదిలారు. ఇది కాస్తా అంచనాలను రెట్టింపు చేసేసింది. మణిశర్మ బీట్.. చిరు గ్రేస్‌తో కూడా స్టెప్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.

అదే హాట్ టాపిక్..
మణిశర్మ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయబోతోన్నాడని, ఇక చిరు తన స్టైల్లో స్టెప్పులతో అదరగొటేందుకు రెడీ అయ్యాడని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక చిరు వయసు అరవై ఆరా? అంటూ ఆ స్టెప్పులను, గ్రేస్‌ను చూసి షాక్ అవుతున్నారు. అందరూ చిరు వయసు మీద కామెంట్లు పెడుతున్నారు.

రేపు సాయంత్రం..
చిరంజీవి ఏజ్ అనేది జస్ట్ నంబర్ అంటూ మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతోన్నారు. ఇక ప్రోమోనే ఇలా ఉంటే పాట ఎలా ఉంటుందో అని అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. రేపు (మార్చి 31) సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు పాట విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











