ఫుల్ రొమాంటిక్‌గా నాని.. హీరోయిన్‌ను ముద్దులు, కౌగిలింతలతో..
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న 'జెర్సీ' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవల విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా జెర్సీ చిత్రంలోని అదేంటో గానీ ఉన్నపాటుగా అనే మరో పాటను వీడియోను రిలీజ్ చేశారు.
వన్ లాస్ట్ ముద్దు అంటూ శ్రద్దను ఏడ్పించడం.. ఆమె ముద్దు పెట్టగానే.. నేను పెడుతాను అంటూ చిలిపిగా నవ్వడం పాటలో క్రేజీగా ఉంది.

అదేంటో గానీ ఉన్నపాటుగా..
అమ్మాయి ముక్కు మీద నేరుగా..
తరాల నాటి కోపమంత.. ఎరుపేగా
అంటూ పాట రొమాంటిక్‌గా సాగింది. నాని, శ్రద్ద శ్రీనాథ్ మధ్య చిలిపి సన్నివేశాలు, ముద్దులు, కౌగిలింతలు యూత్‌ను గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి.
ఊరెలుతున్నావా? వెళ్లి స్నానం చేసి వస్తాను.. పెళ్లి చేసుకుందాం అంటూ చెప్పే హృదయాన్ని టచ్ చేసేలా ఉన్నాయి.
'జెర్సీ' చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నది. ఈ చిత్రం మా బేనర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు.
నటీనటులు: నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర, రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన తారాగణం.


Click it and Unblock the Notifications











