అందాలు ఆరబోస్తున్న సల్మాన్ సోదరుడి ప్రేయసి.. మికా సింగ్‌తో అంగాంగ ప్రదర్శన
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ప్రేయసిగా గుర్తింపు తెచ్చుకొన్న జార్జియా అండ్రియానీ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో సత్తా చాటుతున్నారు. ఇటలీకి చెందిన సూపర్ మోడల్, నటి తాజాగా సంగీత ప్రియులను దశాబ్దాల కాలంగా ఆకట్టుకొటున్న కిషోర్ కుమార్ స్వరపరిచిన రూప్ తేరా మస్తానా పాటతో ముందుకొచ్చారు. ప్రముఖ గాయకుడు మికా సింగ్‌తో కలిసి ఈ పాటలో అందాలను ఆరబోశారు. ఈ పాటలో దేశీ రొమాన్స్‌తో హోయలు ఒలికించారు.
రూప్ తేరా మస్తానా పాట అందించిన విజయంతో ఆనందంలో మునిగిపోయారు. తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన గ్లామర్ ఫోటోలు ఆకట్టుకొంటున్నాయి. ఇక తన తదుపరి మ్యూజిక్ ఆల్బమ్ కోసం దుబాయ్‌కు వెళ్తున్నారు. సల్మాన్ ఖాన్ మూవీలోని ఆంఖోకి గుస్తాఖియా పాటతో మరో మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందిస్తున్నారు. ఈ పాటను దుబాయ్‌లో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తున్నది.

జార్జియా అండ్రియానీ కెరీర్ విషయానికి వస్తే.. యువ హీరో శ్రేయాస్ తల్పాడేతో కలిసి వెల్‌కమ్ టూ బజ్రంగ్‌పూర్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే వివాదాస్పద చిత్రం శ్రీదేవి బంగ్లా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











