Iti Acharya కు హాలీవుడ్ గుర్తింపు.. మెర్లిన్ బాబాజీతో కలిసి మ్యూజిక్ వీడియో!
ఇండియన్ సినిమా రంగంలో నటిగా, నిర్మాతగా రాణిస్తూ అందరి ఆకట్టుకొంటున్నఇతి ఆచార్య హాలీవుడ్‌లో ప్రవేశించనున్నారు. అమెరికన్ నటుడు మెర్లిన్ బాబాజీ, 2022 గ్రామీ అవార్డు నామిని అభి ఆచార్యతో కలిసి ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోలో నటించనున్నారు. ఈ వీడియోను ఆర్వీఎస్పీ ఫిల్మ్స్ నిర్మిస్తున్నది.
మెర్లిన్ విషయానికి వస్తే.. అమెరికా మ్యూజిక్ రంగంలో సింగర్, కంపోజర్‌గా రాణిస్తున్నారు. మెర్లిన్ రూపొందించిన వైబ్స్ అనే పాట గతేడాది సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్‌ను అందుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్‌ను విశేషంగా ఆలరించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొన్నది.

ఇక ఇతి ఆచార్య విషయానికి వస్తే.. గతేడాది కేన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో రెడ్ కార్పెట్ ఆహ్వానం అందుకోవడమే కాకుండా ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఇతి ఆచార్య పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఓవర్సీస్‌లో పలువురు ఫిల్మ్ మేకర్స్‌తో వర్క్ చేస్తున్నారు. ఆమె రూపొందించిన లవర్ హర్ టూ మచ్ అనే వీడియో న్యూయార్క్ సిటీలోని టైమ్ స్వ్కేర్ బిల్ బోర్డ్స్‌పై ప్రదర్శించడం విశేషంగా మారింది.
లవర్ హర్ టూ మచ్ మ్యూజిక్ వీడియోను ఆర్వీఎస్పీ ఫిల్మ్స్ రూపొందించడం ఆనందంగా ఉంది. ఈ పాటను మొట్టమొదటిసారి విన్న వెంటనే అందులో నటిస్తానని మెర్లిన్‌కు చెప్పాను. మెర్లీన్‌తో ఏడాదిగా నేను ట్రావెల్ అవుతున్నాను.

ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా పెద్ద అభిమానిని. మెర్లిన్ మంచి మనసు ఉన్న వ్యక్తిగా నేను అతడిని అభిమానిస్తాను అని ఇతి ఆచార్య అన్నారు. ఇతి ఆచార్య సోదరుడు అభి ఆచార్య కూడా అమెరికాలో మ్యూజిక్ ఆర్టిస్టుగా వర్క్ చేస్తున్నారు. 2023 గ్రామీ అవార్డుల కోసం నామినేట్ అయ్యారు.
ఇతి ఆచార్య విషయానికి వస్తే.. యాక్టర్, నిర్మాత దక్షిణాది సినిమా రంగంలో సుపరిచితులు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న తొలి కన్నడ నటిగా గౌరవాన్ని దక్కించుకొన్నది. శివరాజ్ కుమార్‌తో కలిసి నటించారు. ఆమె నటించిన, నిర్మించిన చిత్రాలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ రావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











