Kaavaala Song: అదరగొట్టిన తమన్నా.. యూత్ అంతా ఫిదా.. ఆ మార్క్ దాటిన 'కావాలా' పాట

అభిమాన హీరోలు, హీరోయిన్ల సినిమాలు నచ్చితే బ్లాక్ బస్టర్ హిట్ అందించి కోట్లల్లో కలెక్షన్స్ వచ్చేలా చేస్తారు ఆడియెన్స్. ఇక అభిమానులు అయితే రిపీటెడ్ గా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. సినిమాల తర్వాత అంతలా హిట్ అయ్యేవి సాంగ్స్. అవును, ఒక సినిమా మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అయిందంటే ఆ మూవీ సగం హిట్ కొట్టేసినట్లే.

కొన్నిసార్లు సాంగ్స్ హిట్ టాక్ వచ్చినా సినిమాలు మాత్రం రావు. ఏది ఏమైనా ఇటీవల తమన్నా ఘాటుగా స్టెప్పులేసి ఉర్రూతలూగించిన పాట 'కావలా సాంగ్' (Kaavaala Song). ఇప్పుడు ఈ పాట సరికొత్త మార్క్ చేరుకుంది.

Actress Tamanna Kaavaala Song From Jailer Reached To 100 Million Views

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా నటించిన చిత్రం జైలర్ (Jailer Movie). కోకోకిల, వరుణ్ డాక్టర్, బీస్ట్ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఈ సినిమాలో రజనీ కాంత్ కు జోడీగా మిల్కీ సుందరి తమన్నా చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. అలాగే ఇందులో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న జైలర్ సినిమాను ఆగస్టు 10న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా 'కావాలా' అనే పాటలో తమన్నా తన అందచందాలతో కట్టిపడేసింది. ఘాటు స్టెప్పులు, మత్తెక్కే ఎక్స్ ప్రెషన్స్ తో యువతకు పిచ్చెక్కించింది. దీంతో ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.

జైలర్ సినిమాలోని కావాలా పాటను గత నెలలో యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాట అతి తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అనేక మంది ఇదే పాటపై రీల్స్ చేయడంతో తెగ ట్రెండ్ అయింది. అయితే విడుదలైన నాలుగు వారాల్లోనే కావాలా సాంగ్ 100 మిలియన్ అంటే 10 కోట్ల వ్యూస్ ను దాటేసింది. అలాగే 13 లక్షల లైక్స్ తెచ్చుకుంది. ఇక ఈ పాటను స్పాటిఫైలో 17 మిలియన్ల సార్లు, గూగుల్ మ్యూజిక్ లో 10 మిలియన్ల సార్లు శ్రోతలు విన్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. ప్రస్తుతం Kaavaala100M అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X