భీమ్లా నాయక్ నుంచి వాయిదా పడిన పాట రిలీజ్.. ఈసారి ఎప్పుడు వదులుతున్నారు అంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ 'భీమ్లా నాయక్'. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర దగ్గుబాటి రానా పోషిస్తూ ఉండగా మలయాళంలో బిజు మీనన్ పోషించిన పాత్ర ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. సినిమా అక్కడ ఉన్నది ఉన్నట్టు కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సింహ భాగం పూర్తయింది. మలయాళంలో ఈ సినిమా చూసిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఈ సినిమా హక్కులను ఆ వెంటనే కొన్నారు. సినిమా కొన్నప్పటి నుంచి ఈ సినిమాలో రానా పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంది కాకపోతే పోలీస్ అధికారి పాత్ర విషయంలో అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ చివరికి పవన్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమా 2022 జనవరి 12న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉండగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే కొన్ని పోస్టర్లు, ప్రమోషనల్ స్టఫ్ బయటకు రాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన సింగిల్‌ను విడుదల చేస్తామంటూ రీసెంట్ గా ప్రకటించారు. కానీ తాజాగా ఆ సాంగ్ వాయిదా పడింది. 'అడవి తల్లి మాట' అనే టైటిల్‌తో రూపొందిన ఈ పాటను డిసెంబర్ 1న ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తామని ముందు అధికారికంగా ప్రకటించారు. అయితే అప్పుడే ఇండస్ట్రీలో లెజెండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో విషాదఛాయలు అలుముకున్న నేపథ్యంలోనే సాంగ్ విడుదలను వాయిదా వేసినట్లు ప్రకటించారు. అలాంటి సమయంలో మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో సీతారామ శాస్త్రి గారి గౌరవార్ధం సాంగ్ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేశారు.

Adavi Thalli Maata from Pawan Kalyans bheemla nayak to release on 4th december

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ నేపథ్యంలో రేపు అంటే శనివారం ఉదయం 10 : 08 నిమిషాలకు అడవి తల్లి మాట అనే సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం దీనికి సంబంధించిన అప్ డేట్ ఇస్తూ రానా, పవన్ కలిసి ఉన్న ఓ ఫోటోను వదిలారు. ఈ సినిమాలో పవన్ ముఖంలో కోపం తాండవిస్తుండగా.. రానా కూల్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ 'అడవి తల్లి మాట' సాంగ్ కు ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X