పిల్లాజెల్లా ఇంటికాడా ఎట్లవున్రో.. కరోనాపై ఆదేష్ రవి పాట
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో చిక్కుకుని ఉంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. లాక్ డౌన్ విధించడం వల్ల ఎంతో కొంత కట్టడి చేయగలిగారు. అయితే ఈ లాక్ డౌన్ విధించడం వల్ల ఎంతోమంది ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. ఇంకెంతో మంది తమ కుటుంబాలకు దూరంగా, గూడు, తిండి లేకుండా బతకాల్సి వచ్చింది. ఇంత వరకు కరోనాపై అవగాహన కల్పిస్తూ ఎంతో మంది పాటలు రచించారు. ఆలపించారు.
కానీ ఇల్లే లేనివాళ్ల పరిస్థితికి, 'ఉన్న వూరు-కన్నతల్లి'కి దూరంగా ఉండిపోయిన కోట్లాది వలస జీవులు పడుతున్న పడరాని పాట్లకు, సొంతూళ్లకు చేరుకోవడానికి వందలు-వేల కిలోమీటర్లు నడుస్తున్న వారి దీనావస్థకు అక్షర రూపం ఇవ్వడంతో పాటు.. దానిని స్వీయ స్వర రచనలో పాటగా ఈ 'కరోనా కాలం'లోని మరో కోణాన్ని ఆవిష్కరించి శభాష్ అనిపించుకుంటున్నాడు ప్రముఖ పాటల రచయిత ఆదేష్ రవి.

'తుపాకి రాముడు' చిత్రానికి డైలాగ్ రైటర్, సౌండ్ ఇంజినీర్, క్యాస్టింగ్ డైరెక్టర్, కో-డైరెక్టర్ గా పని చేయడంతోపాటు.. అందులో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించి మెప్పించిన ఆదేష్.. 'డాటర్ ఆఫ్ వర్మ' చిత్రానికి సంగీతం అందించాడు. తాజాగా కరోనా వైరస్ వెనుకున్న మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ.. 'నా ముసలితల్లి ఏమివెట్టి సాదుతుందో... ఇడిసి పెడితే.. నడిసి నేను పోతా సారూ'అంటూ... అభాగ్య వలస జీవుల వెతలకు అద్దం పట్టిన ఈ పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది.


Click it and Unblock the Notifications











