Adipurush: జై శ్రీరామ్ వీడియో వచ్చేసింది.. అసలు మామూలుగా లేదుగా!
సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతూ తన క్రేజ్‌ను, మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఎన్నో ఏళ్ల పాటు తెలుగులో హవాను చూపించిన అతడు.. కొంత కాలంగా పాన్ ఇండియా స్టార్‌గా సందడి చేస్తూ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు.
ఈ ఉత్సాహంతోనే వరుసగా భారీ ప్రాజెక్టులనే చేస్తూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ నేరుగా బాలీవుడ్‌లోనే 'ఆదిపురుష్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనిపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.

బాలీవుడ్‌లో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్‌తో కలిసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ చూపించని కంటెంట్లతో.. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న పాయింట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాజాగా ఓ లిరికల్ వీడియో విడుదలైంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా దీని నుంచి 'జై శ్రీరామ్' అంటూ సాగే ఓ లిరికల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దీనికి అజయ్ - అతుల్ సంగీతం అందించగా.. సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇచ్చారు. ఇందులో వచ్చిన పదాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సాంగ్ కంపోజింగ్ గూస్‌బమ్స్ తెప్పించే విధంగా ఉంది. దీంతో ఈ మోషన్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది.
'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











