Adipurush: జై శ్రీరామ్ వచ్చేది ఆరోజే.. ఈసారి మామూలుగా ఉండదు
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో అలరించి.. సుదీర్ఘ కాలం పాటు స్టార్‌డమ్‌తో సత్తా చాటిన హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిన అతడు.. అప్పటి నుంచి బహు భాషా చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లో 'ఆదిపురుష్' అనే సినిమాను కూడా చేశాడు. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ దీన్ని రూపొందించాడు. రామాయణం నేపథ్యంతో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
'ఆదిపురుష్' మూవీ చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న పాయింట్‌తో తెరకెక్కింది. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇటీవలే ముగిశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని భాషల్లోనూ భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ వీడియో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను కూడా సొంతం చేసుకుంది

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ దీని నుంచి మరిన్ని సర్‌ప్రైజ్‌లను ఇవ్వబోతుంది. ఇందులో భాగంగానే తాజాగా దీని నుంచి 'జై శ్రీరామ్' అంటూ సాగే ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. దీన్ని మే 20వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిన్న వీడియోను కూడా షేర్ చేసింది. ఇక, ఈ పాటకు అజయ్ - అతుల్ సంగీతం అందించగా.. సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇచ్చారు.
క్రేజీ కాంబోలో వస్తున్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











