Adipurush: గూస్‌బమ్స్ తెప్పించేలా జై శ్రీరామ్ సాంగ్.. ఆ విజువల్స్ ఏంటి గురూ!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా అతడు దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు. దీనికితోడు కొంత కాలంగా పాన్ ఇండియా స్టార్ స్టేటస్‌ను కూడా చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. అందులో ఒక బాలీవుడ్ స్ట్రయిట్ మూవీ కూడా ఉంది. అదే.. రామాయణం నేపథ్యంలో రాబోతున్న 'ఆదిపురుష్'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.
చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న పాయింట్‌తో 'ఆదిపురుష్' మూవీ తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో టెక్నికల్ వండర్‌గా వస్తున్న ఈ క్రేజీ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇటీవలే ముగిశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తీసుకు వచ్చారు. దీనికి అన్ని భాషల్లోనూ భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ వీడియో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను కూడా దక్కించుకుంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ దీని నుంచి మరిన్ని సర్‌ప్రైజ్‌లను తీసుకు రాబోతుంది. ఇందులో భాగంగానే తాజాగా దీని నుంచి 'జై శ్రీరామ్' అంటూ సాగే సాంగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ముంబైలో జరిగిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్‌లో దీన్ని వదిలారు. ఈ పాటకు అజయ్ - అతుల్ సంగీతం అందించగా.. సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇచ్చారు. ఇందులో విజువల్స్ కన్నుల పండుగలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక, లిరిక్స్ గూస్‌బమ్స్ తెప్పించే విధంగా ఉంది. దీంతో ఇది తెగ వైరల్ అవుతోంది.
'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











