Adipurush: ప్రభాస్ నుంచి మరో ట్రీట్.. సినిమాలో అసలైన సోల్ ఇదే
పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ఏకధాటిగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకకాలంలో నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లోనే 'ఆదిపురుష్' అనే సినిమాను కూడా చేశాడు. తనదైన చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న ఓం రౌత్ దీన్ని రూపొందించాడు. రామాయణం నాటి కథతో రాబోతున్న ఈ మైథాలజీ మూవీపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయని చెప్పొచ్చు.
చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న పాయింట్‌తో 'ఆదిపురుష్' మూవీ తెరకెక్కింది. అత్యున్నత సాంకేతిక విలువలతో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇటీవలే ముగిశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను, ఓ పాటను విడుదల చేశారు. వీటికి అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇవి రికార్డు స్థాయిలో వ్యూస్‌ను కూడా సొంతం చేసుకున్నాయి.

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ దీని నుంచి మరిన్ని సర్‌ప్రైజ్‌లను ఇవ్వబోతుంది. ఇందులో భాగంగానే తాజాగా దీని నుంచి 'రాం సీతా రాం' అంటూ సాగే ఫుల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని మే 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్‌ను కూడా వదిలింది. ఇక, ఈ పాటకు అజయ్ - అతుల్ సంగీతం అందించారు.

విజువల్ వండర్‌గా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











