twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ghani: వరుణ్ తేజ్ కోసం సింగర్‌గా మారిన లెజెండరీ డైరెక్టర్ కూతురు

    |

    మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే తన టాలెంట్లతో ప్రేక్షకులను ఫిదా చేసిన అతడు.. చాలా విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న వరుణ్ తేజ్.. రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు.

    <strong>బట్టలున్నా లేనట్లే మలైకా అరోరా అరాచకం: 48 ఏళ్ల వయసులో శృతి మించి మరీ దారుణంగా!</strong>బట్టలున్నా లేనట్లే మలైకా అరోరా అరాచకం: 48 ఏళ్ల వయసులో శృతి మించి మరీ దారుణంగా!

    సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ లేనంత భీకరమైన ఫామ్‌లో ఉన్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం చాలా లేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. అంతేకాదు, ఆ వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ కూడా మొదలు పెట్టేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి.

    Aditi Shankar Turns Singer for Varun Tejs Ghani Movie

    క్రేజీ కాంబినేషన్‌లో బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్‌ 24కు వాయిదా వేశారు. కానీ, అప్పటికి కూడా పనులన్నీ పూర్తవలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఏకంగా మార్చి 18కి వాయిదా వేసేశారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్‌ను కూడా మొదలు పెట్టారు.

    <strong>ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!</strong>ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!

    'గని' సినిమా నుంచి ఇప్పటికే పలు స్పెషల్ వీడియోలతో పాటు కొన్ని పాటలు కూడా విడుదల అయ్యాయి. వీటన్నింటికీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు మరో పాటను విడుదల చేయబోతున్నారు. 'రోమియో జూలియట్' అంటూ సాగే ఈ పాటను ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక, ఈ పాటను లెజెండరీ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి పాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆమె.. ఈ పాటతో సింగర్‌గానూ మారినట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సాంగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

    'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను చేస్తున్నారు.

    English summary
    Mega Prince Varun Tej Now Doing Ghani Movie Under Kiran Korrapati Direction. Aditi Shankar Turns Singer for This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X