కింగ్ ఆఫ్ జంగిల్‌లా రంగంలోకి బాలకృష్ణ.. అడుగడుగో యాక్షన్ హీరో!!
నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'రూలర్'. సి.కల్యాణ్ నిర్మాణంలో భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మరింత వేగవంతం చేసింది చిత్రయూనిట్.

వేగవంతమైన ప్రమోషన్స్.. బాలయ్య అభిమానుల్లో ఆతృత
రూలర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే బాలకృష్ణ లుక్స్, టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకున్నాయి. ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా ఈ చిత్రంలో బాలయ్యబాబు యంగ్ లుక్‌లో దర్శనమీయనుండటం నందమూరి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అభిమానుల ఆతృతను మరింత పెంచేలా తాజాగా చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

అడుగడుగో యాక్షన్ హీరో అంటూ రంగంలోకి బాలకృష్ణ
''అడుగడుగో యాక్షన్ హీరో'' అంటూ సాగిపోతున్న రూలర్ ఫస్ట్ లిరికల్ సాంగ్ నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. కింగ్ ఆఫ్ జంగిల్‌లా వచ్చాడంటూ బాలకృష్ణను ఆకాశానికెత్తుతూ ఈ సాంగ్ సాగిపోతోంది. ఇక ఇందులో లుక్స్ పరంగా బాలకృష్ణ అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

రామజోగయ్య శాస్త్రి లిరిక్స్.. సాయి చరణ్ భాస్కరుని ఆలాపన
ఇక ఈ పాటకు చిరంతన్ భట్ సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. సాయి చరణ్ భాస్కరుని ఆలపించారు. మొత్తానికి బాలయ్య అభిమానుల్లో ఈ సాంగ్ సంక్రాంతి జోష్ నింపిందనే చెప్పుకోవచ్చు. ఈ లెక్కన చూస్తుంటే నందమూరి అభిమానులకు సంక్రాంతి పండగ ఈ డిసెంబర్ లోనే వచ్చేస్తోందని అనిపిస్తోంది.
ప్రేక్షకుల అంచనాలు.. ఇద్దరు హీరోయిన్లతో బాలకృష్ణ
గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన `జైసింహా` సూపర్ డూపర్ హిట్ కావడంతో 'రూలర్' సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. బాలకృష్ణ 105వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో ఆయన సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారని టాక్.

భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇక రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరపాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ మేరకు డిసెంబర్ 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముహూర్తం ఫిక్స్ చేశారనేది ఇన్‌సైడ్ టాక్. ఈ వేడుకలో బాలయ్య సహా పలువురు సినీ ప్రముఖుల సందడి కనిపించనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











