చేతిలో మందు గ్లాసు, చుట్టూ అమ్మాయిలు.. బాలయ్య హంగామా మామూలుగా లేదుగా!

నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా 'రూలర్'. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ హంగులతో సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నారు. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది చిత్రయూనిట్.

ఈ మేరకు రూలర్ నుంచి బాలకృష్ణ లుక్స్, పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే విడుదలైన అడుగడుగో యాక్షన్ హీరో సాంగ్ నందమూరి అభిమానులను ఉర్రూతలూగించింది. తాజాగా ఈ పాట వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో బాలకృష్ణ లుక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. చేతిలో మందు గ్లాసు పట్టుకొని అమ్మాయిల నడుమ ఉన్న బాలయ్య సీన్స్ చూస్తుంటే 'రూలర్' సెన్సేషన్ ఎలా ఉండనుందో అర్థమవుతోంది.

Adugadugo Action Hero video song from Nandamuri Balakrishnas Ruler

ఈ సినిమా కోసం బాలయ్య బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఆయన ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దీంతో 'రూలర్' సినిమా హక్కులను భారీ డిమాండ్ ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X