23 ఏళ్లకు దుమ్ములేపుతున్న చక్రి.. గోల్డెన్ సాంగ్ రికార్డు.. మెట్టమొదటి సారిగా
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తనదైన శైలిలో సినిమాలకు పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి సంగీత ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. తనదైన సంగీతాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి సంగీత ప్రియులను తన అభిమానులు గానూ మార్చుకున్నారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో పోటి పడి మరీ చక్రి మెలోడీ, మాస్ బీట్ లలో సాంగ్స్ ను అందించారు. కానీ ఆరోగ్యం బాలేక ఆయన 2014లో మ్యూజిక్ వరల్డ్ కు దూరమైన విషయం తెలిసిందే. అయితే భౌతికంగా ఆయన ప్రేక్షకుల్లో లేకపోయినా అయిన అందించిన సంగీతం ద్వారా టాలీవుడ్ లో ఇటు, తెలుగు ప్రేక్షకుల్లో చిరకాలం గుర్తిండిపోయారు. ఇప్పటికీ చక్రి సంగీతాన్ని ప్రజలు ఇష్టపడుతుండటం విశేషం. చక్రి సంగీతంలోని మాధుర్యం, భావం, ఎమోషనల్ టచ్ ఆయనకు గుండెల్లో గుడి కట్టేలా చేశాయి.

అయితే చక్రి 'బాచీ' చిత్రంతో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయగా చక్రి సంగీత దర్శకుడిగా పనిచేశారు. అప్పటి నుంచి తన డెత్ వరకు నిర్విరామంగా సంగీతం అందిస్తూనే వచ్చారు. అయితే చక్రి అందించిన సినిమా పాటల్లో 'ఇడియట్' సినిమా సాంగ్స్ కు ప్రత్యేకమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. 'చూపుల్తో గుచ్చి గుచ్చి' పాట మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. మాస్ మహారాజ రవితేజ కెరీర్ లోనూ ఆ పాట ఎంతో విజయాన్ని, పేరును సాధించి పెట్టింది.
అయితే 2022లో 'ఇడియట్' ద్వారా ఆ సాంగ్ ప్రేక్షకులకు అందించారు చక్రి. ఇక ఇప్పుడు మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఆ సాంగ్ ను ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. మాస్ మహారాజా రవితేజ - శ్రీలీలా జంటగా నటిస్తున్న 'మాస్ జాతర' సినిమాలో చక్రి అందించిన 'చూపుల్తో' సాంగ్ ను రీక్రియేట్ చేశారు. ఈ తరం యువతను ఆకట్టుకునే సాహిత్యంతో రీ క్రియేట్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆ సాంగ్ కు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు.
తు మేరీ లవర్.. అనే టైటిల్ తో విడుదలైన ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో మోత మోగుతోంది. ఆ సాంగ్ కు ప్రస్తుతం 1.2 మిలియన్ల వ్యూస్ దక్కాయి. యూట్యూబ్ మ్యూజిక్ లో #2గా సాంగ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. రీక్రియేట్ చేసిన సాంగ్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. భాస్కరభట్ల రవి కుమార్ లిరిక్స్ అందించారు. ఏఐ ద్వారా చక్రి వాయిస్ ను జనరేట్ చేయడం టాలీవుడ్ లోనే మొదటి ప్రయోగంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి భాను బోగవరాజు దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌంజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











