Devara: పాపం జాన్వీ కపూర్.. దేవరలో ఆ పాటనే కాకుండా మరో పాట లేపేసారా?

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో మళ్ళీ చాలా కాలం తర్వాత మాట్లాడుకుంటున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ నటించిన తన సోలో అండ్ అవైటెడ్ భారీ చిత్రం "దేవర" అనే చెప్పాలి. కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని డే 1 కి ఈ చిత్రం అందుకోగా మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 300 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని ఎన్టీఆర్ కెరీర్ లోనే సోలోగా రికార్డు గ్రాసర్ గా నిలిచింది.

కాగా ఈ చిత్రం ఇదంతా మిక్స్డ్ టాక్ తోనే చేస్తుండగా ఒకవేళ పర్ఫెక్ట్ టాక్ కానీ పడుంటే దేవర సంచలనం ఇంకోలా ఉండేదని చెప్పవచ్చు. ఇలా దేవర మేనియా అంతా కనిపిస్తుండగా ఈ సినిమాలో రిలీజ్ కి ముందే విడుదల చేసిన ఓ మాస్ అండ్ గ్లామర్ సాంగ్ ని అయితే మేకర్స్ తెరకెక్కించి మరీ సినిమాలో పెట్టలేదు. అదే ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్ పై చేసిన మాస్ నెంబర్ దావుది సాంగ్.

after removing daavudi song from devara is another song also removed

మరి రిలీజ్ కి ముందు వచ్చిన ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ ని కూడా పాన్ ఇండియా ఆడియెన్స్ లో అందుకుంది. కానీ సినిమాలో ఈ సాంగ్ ని సినిమా ఎండ్ టైటిల్ కార్డ్స్ లో ఇస్తారని తెలిపారు. కానీ తర్వాత సినిమాలో క్లైమాక్స్ లో కనిపించే బలమైన ఎమోషనల్ ట్విస్ట్ తో అయితే ఈ సాంగ్ ప్లేస్ మెంట్ కరెక్ట్ కాదని ఆ సాంగ్ ని ఏకంగా సినిమాలో తీసి పక్కన పెట్టేసారు.

మరి ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఓ షాక్ అయితే సినిమాలో ఈ సాంగ్ కాకుండా మరో సాంగ్ ని అది కూడా ఇపుడు వరకు విడుదల చేయని సాంగ్ ని షూట్ చేసి తీసేసారా? అనే టాక్ ఇపుడు వినిపిస్తుంది. కాగా ఎన్టీఆర్, కొరటాల గత సినిమా జనతా గ్యారేజ్ లో కాజల్ అగర్వాల్ తో పక్కా లోకల్ అనే మాస్ ఐటెం సాంగ్ ని పెట్టిన సంగతి తెలిసిందే.

after removing daavudi song from devara is another song also removed

అదే సెంటిమెంట్ తో దేవర లో కూడా ఓ ఐటెం సాంగ్ ని బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటితో షూట్ చేసారని ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి. కానీ సీన్ కట్ చేస్తే సినిమాలో ఆ సాంగ్ ఆనవాలు కూడా లేదు. దేవర తోనే ఆ సాంగ్ ఉంటుంది అన్నట్టుగా కూడా అప్పుడు టాక్ వచ్చింది.

మరి నిజంగానే ఆ సాంగ్ ని కూడా తీసేసారా లేక అసలు షూట్ చెయ్యలేదా పోనీ సినిమా ఇప్పటికే 3 గంటల దగ్గరగా వచ్చింది అని కట్ చేసారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇవన్నీ కాకపోతే ఇది పార్ట్ 2 లో ఏమన్నా ఉంటుందా అనేది మాత్రం మున్ముందు క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రాన్ని అనిరుద్ క్రేజీ మ్యూజిక్ ని అందించగా తన పాటలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

More from Filmibeat

Read more about: janhvi kapoor jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X