మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ''మనసా మనసా'' లిరికల్ సాంగ్: సిద్ శ్రీరామ్ మ్యాజిక్
''అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టని అక్కినేని అఖిల్ నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్నాడు. ఈ మేరకు న్యూ అండ్ క్రేజీ లుక్ లోకి మారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో సినిమాలో నటిస్తున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ విషయంలోనూ ప్రత్యేకత చాటుకుంటూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' విడుదల చేసి అక్కినేని అభిమానులను ఖుషీ చేసిన ఆయన.. తాజాగా చిత్రంలోని ''మనసా మనసా'' అంటూ సాగే లిరికల్ సాంగ్ వీడియో విడుదల చేశారు.

సురేంద్ర కృష్ణ అందించిన లిరిక్స్ పై సిద్ శ్రీరామ్ మరోసారి మ్యాజిక్ చేశాడు. ''మనసా మనసా'' అంటూ మెలోడీ ట్యూన్‌లో సంగీత ప్రియులను కట్టి పడేశారు. విడుదలైన కాసేపట్లోనే ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











