AGENT: ఆ రిలీజ్ ఆపేసిన అఖిల్.. స్పెషల్ ట్రీట్ విషయంలో బిగ్ ట్విస్ట్
హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన తర్వాత చాలా కాలం పాటు వరుసగా ఫ్లాపులను చవి చూసి.. గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు అక్కినేని వారసుడు అఖిల్. మొదటి మూడు చిత్రాలు సరిగా ఆడకపోవడంతో అతడి కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత ఏడాది విడుదలైన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో అక్కినేని అఖిల్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఈ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో 'ఏజెంట్'గా రాబోతున్నాడు.
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపకల్పనలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే 'ఏజెంట్'. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా స్పై థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కింది. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడిపోయింది. దీంతో అసలు ఇది మొత్తానికే ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. కానీ, దీన్ని ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'ఏజెంట్' మూవీలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను పెట్టినట్లు ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ, బాస్ పార్టీ సాంగ్ ఫేం ఊర్వశీ రౌటేలాతో కలిసి అఖిల్ అదరగొట్టేశాడు. ఇక, ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ మొదటి భావించిందట. కానీ, చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుని నేరుగా థియేటర్లలోనే ఈ పాటను చూపించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. అంటే.. ఈ స్పెషల్ సాంగ్‌ను కేవలం సినిమాలో మాత్రమే చూసి సర్‌ప్రైజ్ అయ్యేలా ప్లాన్ చేశారని చెప్పొచ్చు.
సురేందర్ రెడ్డి రూపొందించిన 'ఏజెంట్' మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











