Leharaayi Lyrical Song: రొమాన్స్ డోస్ పెంచిన ‘బ్యాచ్‌లర్’.. పాటకు హైలైట్ అతడే

అక్కినేని ఫ్యామిలీ నుంచి 'అఖిల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు హ్యాండ్సమ్ గాయ్ అక్కినేని అఖిల్. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక, ఆ తర్వాత అతడు నటించిన 'హలో', 'మిస్టర్ మజ్నూ' కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ యంగ్ హీరోకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా ఇప్పటి వరకూ అందలేదు. అయినప్పటీ ఈ స్టార్ కిడ్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటించాడు.

ఫ్లాపుల పరంపర నుంచి బయట పడాలన్న పట్టుదలతో ఉన్న అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ, కరోనా రెండు లాక్‌డౌన్ల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు కొన్ని రీషూట్ల వల్ల ఇది మరింత లేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఫస్ట్ కాపీ రెడీ అయింది. దీనిపై చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉంది. దీంతో దీన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది చిత్ర యూనిట్.

Akhil Most Eligible Bachelor Leharaayi Lyrical Song Released

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభిచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలోని 'లెహరాయి' అనే ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాటను యంగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులోని లిరిక్స్.. దాన్ని సిద్ ఆలపించిన తీరు హైలైట్‌గా నిలుస్తున్నాయి. గోపీ కంపోజింగ్ కూడా ఆకట్టుకుంది. మొత్తంగా ఇది అదుర్స్ అనిపిస్తోంది.

రొమాంటిక్ ఫీల్‌తో సాగిన 'లెహరాయి' పాటలో పిక్చరైజేషన్ కూడా సూపర్‌గా ఉంది. మరీ ముఖ్యంగా ఇందులో హీరో, హీరోయిన్లు అఖిల్, పూజా హెగ్డే మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. పాటకు తగ్గట్లుగానే ఫీల్‌ను కనబరుస్తూ సాగిందిది. దీంతో ఈ సాంగ్‌ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. దీన్ని అక్కినేని అభిమానులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెగ షేర్లు చేస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ రొమాంటిక్ రోల్‌లో నటించాడు. అతడికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే పాత్రను అదిరిపోయేలా క్రియేట్ చేశారు. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఎన్నో ఆశల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిపై అక్కినేని అఖిల్‌తో పాటు అతడి అభిమానులు బోలెడు నమ్మకాలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X