పవన్ కల్యాణ్ తర్వాతి స్థానంలో అఖిల్: ఒకే ఒక్క పాటతో సత్తా చాటిన అక్కినేని హీరో

చిన్న వయసులోనే సిసింద్రీగా అలరించి.. 'అఖిల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని అఖిల్. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక, ఆ తర్వాత అతడు నటించిన 'హలో', 'మిస్టర్ మజ్నూ' కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ యంగ్ హీరోకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా ఇప్పటి వరకూ అందలేదు. అయినప్పటీ ఈ స్టార్ కిడ్ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే మూవీ చేశాడు.

ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న అక్కినేని అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ, కరోనా రెండు లాక్‌డౌన్ల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు కొన్ని రీషూట్ల వల్ల ఇది మరింత లేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఫస్ట్ కాపీ రెడీ అయింది. దీనిపై చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉంది. దీంతో ఈ మూవీని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Akhil Most Eligible Bachelor Leharaayi Lyrical Song Trending Second Place in Youtube

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ సినిమాలోని 'లెహరాయి' అనే ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాటను యంగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులోని లిరిక్స్.. దాన్ని సిద్ ఆలపించిన తీరు హైలైట్‌గా నిలుస్తున్నాయి. గోపీ కంపోజింగ్ కూడా ఆకట్టుకుంది. మొత్తంగా ఇది మెప్పించింది.

'లెహరాయి' సాంగ్‌ అఖిల్, పూజా హెగ్డే మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్స్ కూడా బాగున్నాయి. దీంతో ఈ పాటకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఇప్పటికే 4.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, లక్షకు పైగా లైకులను సొంతం చేసుకుంది. ఇక, తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో అదరగొట్టేస్తుంది. మ్యూజిక్ విభాగంలో టాప్‌లో ట్రెండ్ అవుతోన్న జాబితాలో ఇది తాజాగా రెండో స్థానానికి చేరుకుంది. దీని కంటే ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబోలో వస్తున్న 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ ఉంది. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ రొమాంటిక్ రోల్‌లో నటించాడు. అతడికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఎన్నో ఆశల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిపై అక్కినేని అఖిల్‌తో పాటు అతడి అభిమానులు బోలెడు నమ్మకాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X