పవన్ కళ్యాణ్ సినిమాలో అకీరా నందన్.. మెగా ఫ్యాన్స్ కు పునకాలే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( (Pawan Kalyan) తనయుడు అకీరానందన్ (Akira Nandan) టాలీవుడ్ ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఎప్పడెప్పుడాని ఎదురు చూస్తున్న పవన్ అభిమానుల కోరిక త్వరలోనే తీరబోతుంది. అకీరానందన్ టాలీవుడ్ ఎంట్రీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా తోనే. అయితే.. ఇక్కడ ఓ ట్వీట్ ఉంది. పవన్ కళ్యాణ్, అకీరా నందన్ లు కలిసి పనిచేయబోయే సినిమా ఏంటి? ఇంతకీ ఆ ట్వీట్ ఏంటీ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉన్నారు. దీంతో తన కొత్త సినిమాలకు బ్రేక్ పడింది. కానీ.. తన అభిమానులు కొరకు, గతంలో తాను ఇచ్చిన మాట మేరకు సమయం దొరికినప్పుడల్లా షూటింగ్లో పాల్గొని ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇలా వీరమల్లు సినిమా షూటింగ్ పాల్గొన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీలు చూసుకుని ఇతర సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా పవన్ తన నెక్ట్స్ మూవీ ఓజీ పై ఫోకస్ చేశారంట.

తాజాగా ఓజీ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman). పవన్ కళ్యాణ్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రమణ గోగుల (Ramana Gogula) సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలిపారు. పవన్ కోసం రమణ గోగుల చేత ఓజీ సినిమాలో పాడించాలని తమన్ ఆలోచిస్తున్నారట. పవన్ - రమణ గోగుల కాంబోలో వచ్చిన పాటలు ఎలాంటి హిట్టు కొట్టయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ 'ఓజీ'లో నటిస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, ఈ మూవీలో అకిరాను తీసుకురావడానికి తమన్ ఫ్లాన్ చేస్తున్నారట. అయితే.. అది నటుడిగా కాకుండా.. పియానో ప్లేయర్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. అకిరా మంచి పియానో ప్లేయర్ అని తెలుసు. ఇప్పటికే ఆకీరా మ్యూజిక్ కు సంబంధించిన పలు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

పవన్ అభిమానుల కోసం .. అకీరాను 'ఓజీ' సినిమా కోసం పియానో ప్లే చేయించాలని తమన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయమై తాను అకీరా తో మాట్లాడుతాననీ, పియానో ప్లే చేయడానికి అతడు తనకు పర్ఫెక్ట్ ఛాయిస్ అయి తెలిపారు. ఇంతకు ముందు రెండు నెలల పాటు నాతో అకిరా పని చేశాడని, ఓజీ లో కూడా తనతో పని చేయమని అడుగుతానని తమన్ అన్నారు. దీంతో అకీరా నందన్ కి ఓజి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని తమన్ భావిస్తునట్లు తెలుస్తోంది. ఈ అప్డేడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











