ఇంగ్లీష్ పాపతో నాగార్జున సరసాలు.. మామూలుగా లేవండీ బాబు
టాలీవుడ్ మన్మథుడు ఎవరో అందరికీ తెలుసు. ఆయనే ఇప్పుడు మన్మథుడు 2 గా మారాడు. ఆయన టాలెంటే వేరు. హీరోయిన్లతో రొమాన్స్ చేసి కిక్కివ్వడంతో ఆయనను మించిన తెలుగు హీరో లేరనే చెప్పుకోవచ్చు. ఆరు పదుల వయసుకు చేరువలో ఉన్నా రొమాంటిక్ సన్నివేశాల్లో తన స్టయిలే వేరని నిరూపిస్తున్నాడు నాగార్జున. తాజాగా విడుదలైన మన్మథుడు 2 'హే మేనియా' ఫుల్ సాంగ్ చూస్తే వామ్మో అనాల్సిందే.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ మన్మథుడు 2 లో రొమాంటిక్ డోస్ ఎలా ఉంటుందనేది తెలపగా తాజాగా విడుదలైన 'హే మేనియా' ఫుల్ సాంగ్ నాగార్జున లోని రొమాంటిక్‌నెస్ పూర్తిగా బటయపెట్టింది. ఇంగ్లీష్ పాపతో నాగార్జున సరసాలు మామూలుగా లేవండీ బాబు. ఈ చిత్రంలో నాగ్‌తో రొమాన్స్ చేసేది ఒక్క రకుల్ మాత్రమే కాదు ఇంకా చాలామంది బ్యూటీలు ఉన్నారని ఈ సాంగ్ ద్వారా నిరూపితమవుతోంది.

'హే మెనీనా..' అంటూ హాయిగా సాగిపోతున్న ఈ సాంగ్‌లో నాగార్జున, ఇంగ్లీష్ పాప మధ్య షూట్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. మన్మథుడు అనే టైటిల్‌కి తగ్గట్టే ఫారిన్ లొకేషన్లలో నాగార్జున స్పెషల్ కిక్కిచ్చాడు. చేతన్ భరద్వాజ్ సంగీతం, శుభం విశ్వనాథ్ లిరిక్స్ ఈ సాంగ్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సర్వహంగులతో రూపొందింది 'మన్మథుడు 2' మూవీ. గతంలో నాగార్జున కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 9న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











