తెలుగు సినీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. ఆగని ‘అల’ రికార్డులు

తెలుగు సినీ చరిత్రలో అల వైకుంఠపురములో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కేవలం కలెక్షన్లలో ఈ రికార్డులు అని అనుకుంటే పొరబాటే. సోషల్ మీడియాలో అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు సృష్టిస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు. దేశ విదేశాలు దాటాయి.. ఖండాంతరాలు దాటి అల వైకుంఠపురములో పాటలు వినబడుతున్నాయి. తాజాగా అల వైకుంఠపురములో ఆల్బమ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాటలు యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఏ ఆల్బమ్‌కు సొంతం కాని అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

ఒకదాన్ని మించి మరొకటి..

ఒకదాన్ని మించి మరొకటి..

అల వైకుంఠపురములో ప్రభంజనం.. సామజవరగమన పాటతో మొదలైంది. ఎప్పుడైతే సామజవరగమన అందనత్త ఎత్తులో చేరుకుందో.. రాములో రాముల వచ్చి ఇంకో ట్రెండ్ క్రియేట్ చేసిందో అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం ఊగిపోయాయి. ఇక బుట్టబొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు ఫిదా కాని వారెవ్వరూ లేరు.

 సోషల్ మీడియాలో సెన్సేషన్..

సోషల్ మీడియాలో సెన్సేషన్..

అల వైకుంఠపురములో పాటలు సోషల్ మీడియాలో సంచలనాలను నమోదు చేశాయి. ఒక్కో పాట వందల మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి. కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా టిక్ టాక్ వంటి వాటిలో దుమ్ములేపింది. ఎక్కడా చూసిన అల వైకుంఠపురములో పాటలే.. బన్నీ వేసిన స్టెప్పులే హల్చల్ చేశాయి.

సెలెబ్రిటీలు సైతం..

సెలెబ్రిటీలు సైతం..

అల వైకుంఠపురములో పాటలకు సెలెబ్రిటీలు కూడా కాలు కదిపారు. కేవలం టాలీవుడ్ స్టార్సే కాకుండా బాలీవుడ్ బామలు కూడా బన్నీ స్టెప్పులను ఫాలో అయ్యారు. బన్నీ డ్యాన్సులకు వారంతా ఫిదా అయ్యారు. క్రికెటర్స్ సైతం బన్నీలా డ్యాన్సులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Recommended Video

Ala Vaikunthapuramlo Tamil Remake By Shiva Karthikeyan
బిలియన్ క్లబ్‌లో చోటు..

బిలియన్ క్లబ్‌లో చోటు..

తెలుగు సినీ చరిత్రలో ఓ సినిమా పాటలు, ఆల్బమ్ వెయ్యి మిలియన్ల క్లబ్ (బిలియన్)లో చేరడం ఆషామాషీ విషయం కాదు. యూట్యూబ్‌లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అల వైకుంఠపురములో ఆల్బమ్ (లిరికల్, వీడియో సాంగ్స్) బిలియన్ సార్లు చూశారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే విషయం ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X