బుట్టబొమ్మ ఆలస్యం.. అందుకోసమే కదా అంటూ గీతా ఆర్ట్స్‌పై నెటిజన్లు ఫైర్
ప్రస్తుతం అల వైకుంఠపురములో ఫీవర్ నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు ఒక్కో సింగిల్‌ను రిలీజ్ చేస్తూ వస్తోన్న అల వైకుంఠపురములో టీమ్.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. రిలీజ్ చేసిన ప్రతీ సింగిల్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటంతో వారు కూడా ధీమాగానే ఉంటున్నారు. అయితే మరోవైపు మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు నుంచి ప్రతీ సోమవారం ఓ పాటను రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

చెప్పినట్టుగా చేస్తోన్న సరిలేరు..
అయితే ముందుగా చెప్పినదాని ప్రకారమే.. ప్రతీ సోమవారం సాయంత్రం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మైండ్ బ్లాక్, సూర్యుడివో చంద్రుడివో, హీ ఈజ్ సో క్యూట్ అంటూ మూడు పాటలను రిలీజ్ చేశారు. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా సోషల్ మీడియాను షేక్ చేయలేకపోతున్నాయి. అది వేరే విషయమనుకోండి. టైమ్ ముందుగానే చెప్పడం.. చెప్పిన టైమ్‌కు రిలీజ్ చేయడం వంటివి వారి నిబద్దతను నిరూపిస్తున్నాయి.
లేట్ చేస్తోన్న అల యూనిట్..
అయితే అల వైకుంఠపురములో యూనిట్ మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓఎమ్‌జీ డాడీ పాట విషయంలో చెప్పిన టైమ్‌కు కాకుండా ఆలస్యంగా రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అయితే మరోసారి అలానే చేయడంతో నెటిజన్లు గీతా ఆర్ట్స్‌ను ఏకిపారేస్తున్నారు.

గీతాఆర్ట్స్ క్షమాపణ
బుట్టబొమ్మ సాంగ్‌ను నేడు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘సాంకేతిక కారణాల వల్ల నేడు పాటను విడుదల చేయలేకపోతున్నాము. ఈ ఆలస్యానికి మీకు క్షమాపణలు.. త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తామ'ని ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

సరిలేరు కాంపిటషన్‌గా వదిలేందుకేనా?
ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు గీతా ఆర్ట్స్‌పై ఫైర్ అవుతున్నారు. ఇంతకు ముందుకు హారిక అండ్ హాసిని సంస్థ ఇలా చేసేది.. ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా? సరిలేరు పాటకు పోటీగా రిలీజ్ చేసేందుకే వాయిదా వేశారా? మీరు వారినెందుకు ఫాలో అవుతున్నారు? అంటూ ఇలా ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. పాట రావడం లేదని తెలిసిన బన్నీ ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











