బుట్టబొమ్మగా ఆకట్టుకొంటున్న పూజాహెగ్డే.. నాకు నచ్చింది.. మీకు నచ్చిందా.. అల్లు అర్జున్ చిలిపిగా..
అల వైకుంఠపురములో సినిమాలోని పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాలు తాగే చిన్న పిల్లాడి దగ్గరి నుంచి అందరూ తమన్ బాణీలకు చిందులు వేస్తున్నారు. సామజవరగమన అంటూ అందర్నీ మెస్మరైజ్ చేసిన తమన్.. అటుపై రాముల రాముల అంటూ మాస్ స్టెప్పులు వేయించాడు. అది చాలదన్నట్లు ఓ మై గాడ్ డాడీ అంటూ మరో సూపర్ సాంగ్‌ను అందించాడు. ఇలా ఒక్కో పాటతో సినిమాపై అంచనాలు పెంచేస్తూ వస్తుంది చిత్రయూనిట్.

ఆలస్యంగా వస్తోన్న బుట్టబొమ్మ..
‘సాంకేతిక కారణాల వల్ల నేడు పాటను విడుదల చేయలేకపోతున్నాము. ఈ ఆలస్యానికి మీకు క్షమాపణలు.. త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తామ'ని ట్వీట్ చేసింది. చెప్పిన దాని ప్రకారం ఆ మరుసటి రోజున మరో కొత్త తేదీని ప్రకటించింది.

సాంగ్ టీజర్‌తో అంచనాలు..
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివో.. జిందగీకే కట్టుబొమ్మై నన్ను కట్టుకుంటివో అంటూ అర్మాన్ మాలిక్ పాడిన చిన్న బిట్‌ను టీజర్ రూపంలో విడుదల చేసి అంచనాలు పెంచేసింది. ఇది కూడా మరో సామజవరగమన లేదా రాములో రాముల అంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని బన్నీ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.
కోరస్ బృందంతో తమన్ హల్ చల్..
పాట రిలీజ్ కావడానికి మరికొంత సమయం ఉండగా.. కోరస్ బృందంతో కలిసి బుట్టబొమ్మ సాంగ్ హమ్మింగ్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. బుట్టబొమ్మపై హైప్ పెంచేందుకు చిత్రయూనిట్, తమన్ ఇద్దరూ ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నారు. మరి కాసేపట్లో బుట్టబొమ్మ వస్తుందంటూ తమన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అదిరిపోయిన బుట్టబొమ్మ..
గత వారం నుంచి ఊరిస్తూ వచ్చిన బుట్టబొమ్మ వచ్చేసింది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, అర్మాన్ మాలిక్ గాత్రం, తమన్ బాణీ ఇలా ప్రతీ ఒక్కటి బుట్టబొమ్మను మరింత అందంగా మలిచాయి. ఈ లిరికల్ వీడియోను చూస్తుంటే.. బన్నీ, పూజా మధ్య కెమెస్ట్రీ అదిరిపోయేట్టు కనిపిస్తోంది. ఇక ఈ పాట సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
పర్సనల్‌గా నచ్చిన పాట..
అల వైకుంఠపురములో చిత్రాన్ని ప్రత్యేకంగా చూస్తోన్న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ మూవీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని స్వయంగా అభిమానులకు తెలియజేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుట్టబొమ్మ సాంగ్ లింక్‌ను షేర్ చేస్తూ.. ‘నాకు వ్యక్తిగతంగా నచ్చిన పాట.. మీ అందరికీ కూడా నచ్చుతుంద'ని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











