అల..వైకుంఠపురములో న్యూ రికార్డ్.. 2021లో కూడా అదే హవా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం 'అల.. వైకుంఠపురములో..' ఈ సినిమాతోనే త్రివిక్రమ్ ఫామ్ తో పాటు అల్లు అర్జున్ కూడా చాలా రోజులకు అసలైన స్టామినా చూపించాడు. కాంబినేషన్ పవర్ ఏమిటో మరోసారి బాక్సాఫీస్ వద్ద చాలా క్లారిటీగా అర్థమయ్యింది. అయితే 2020లోనే కాకుండా 2021లో కూడా సినిమాకు సంబంధించిన రికార్డులు ఎదో ఒకటి హాట్ టాపిక్ గా అవుతూనే ఉన్నాయి.
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా విజయంలో థమన్ పాత్ర ఎంతో ఉంది. అయితే సినిమాలోని ప్రతి పాట కూడా యూ ట్యూబ్ లో ఒక వండర్ క్రియేట్ చేసింది. అందులో బుట్టబొమ్మ తో పాటు రాములో రాములో కూడా ఇటీవల ఒక మైల్ స్టోన్ ను అందుకుంది. ఈ వీడియో సాంగ్ కు యూ ట్యూబ్ లో ఇటీవల 300మిలియన్ వ్యూవ్స్ ను అందుకుంది.

లిరికల్ వీడియోతో పాటు ఒరిజినల్ వీడియో కూడా 300మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడంతో సౌత్ నెంబర్ వన్ సాంగ్ గా నికిచింది. గత ఏడాది బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్ గా క్రేజ్ అందుకోగా ఇప్పుడు మరో సాంగ్ కొత్త రికార్డును అందుకోవడంతో సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఇక థమన్ ఆ సినిమా ద్వారానే మరిన్ని అవకాశాలు అందుకున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో 10 సినిమాలకు పైగా ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా థమన్ మరింత బిజీగా మారనున్నాడు. చూడాలి మరి ఆ సినిమాల పాటలు ఏ రేంజ్ లో క్లిక్కవుతాయో.


Click it and Unblock the Notifications











