Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యూట్యూబ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బన్నీ స్టామినా అంటే అదే
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాడు. సినిమా వచ్చి ఆరు నెలలు దాటుతున్నా రికార్డులు మాత్రం ఇంకా పరుగులు తీస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో కొత్త కొత్త రికార్డులను నమోదు చేస్తోంది అల వైకుంఠపురములో. ఒక్కో పాట సంచలనంగా మారగా.. నేటికి ప్రతి ఇంట్లో, ప్రతి ఫోన్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది ఆ పాటలను ఆస్వాదిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో అల వైకుంఠపురములో ఫీవర్ ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. తాజాగా ఈ సినిమాలోని పాటలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
వంద మిలియన్ల పాటలు..
హిందీ, తమిళ పాటలు ఐదు వందల మిలియన్లు కూడా ఈజీగా క్రాస్ చేసేస్తూ ఉన్నాయి. అయితే తెలుగులో అలాంటి పాటలు ఎప్పుడు వస్తాయా? అని అందరూ ఎదురు చూశారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టు అల వైకుంఠపురములో పాటలు వచ్చాయి. సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ ఇలా ఒక్కో సాంగ్ కొత్త కొత్త రికార్డులనుక్రియేట్ చేశాయి.
వీడియోలతో అంతా ఫిదా..
సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ పాటలు ఆడియో పరంగా ఎంతటి సంచలనాన్ని నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వీడియో సాంగ్‌లు రిలీజ్ చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి యూట్యూబ్‌కు కునుకు లేకుండా పోయింది. రికార్డ్ వ్యూస్‌తో యూట్యూబ్ హిస్టరీనే మార్చేసింది.
వంద పాటల జాబితా..
పదిహేనేళ్ల యూట్యూబ్ చరిత్రలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద మీడియో సాంగ్‌ల లిస్ట్‌లో ఇంత వరకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కపాట చోటు సంపాదించుకోలేదు. అయితే అల వైకుంఠపురములో మాత్రం ఈ ఘనతను సాధించినట్టు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.
రెండు పాటలు..
ఒక్క పాట కాదు అల వైకుంఠపురములో నుంచి రెండు పాటలు ఆ జాబితాలో చోటు సంపాదించకున్నాయట. బుట్టబొమ్మ పాట 15, రాములో రాముల పాట 49వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికా కారణం తమన్ మ్యూజిక్, అల్లు అర్జున్ స్టెప్పులేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.