twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూట్యూబ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బన్నీ స్టామినా అంటే అదే

    |

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాడు. సినిమా వచ్చి ఆరు నెలలు దాటుతున్నా రికార్డులు మాత్రం ఇంకా పరుగులు తీస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో కొత్త కొత్త రికార్డులను నమోదు చేస్తోంది అల వైకుంఠపురములో. ఒక్కో పాట సంచలనంగా మారగా.. నేటికి ప్రతి ఇంట్లో, ప్రతి ఫోన్‌లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది ఆ పాటలను ఆస్వాదిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో అల వైకుంఠపురములో ఫీవర్ ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. తాజాగా ఈ సినిమాలోని పాటలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

    వంద మిలియన్ల పాటలు..

    వంద మిలియన్ల పాటలు..

    హిందీ, తమిళ పాటలు ఐదు వందల మిలియన్లు కూడా ఈజీగా క్రాస్ చేసేస్తూ ఉన్నాయి. అయితే తెలుగులో అలాంటి పాటలు ఎప్పుడు వస్తాయా? అని అందరూ ఎదురు చూశారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టు అల వైకుంఠపురములో పాటలు వచ్చాయి. సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ ఇలా ఒక్కో సాంగ్ కొత్త కొత్త రికార్డులనుక్రియేట్ చేశాయి.

    వీడియోలతో అంతా ఫిదా..

    వీడియోలతో అంతా ఫిదా..

    సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ పాటలు ఆడియో పరంగా ఎంతటి సంచలనాన్ని నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వీడియో సాంగ్‌లు రిలీజ్ చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి యూట్యూబ్‌కు కునుకు లేకుండా పోయింది. రికార్డ్ వ్యూస్‌తో యూట్యూబ్ హిస్టరీనే మార్చేసింది.

    వంద పాటల జాబితా..

    వంద పాటల జాబితా..

    పదిహేనేళ్ల యూట్యూబ్ చరిత్రలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద మీడియో సాంగ్‌ల లిస్ట్‌లో ఇంత వరకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కపాట చోటు సంపాదించుకోలేదు. అయితే అల వైకుంఠపురములో మాత్రం ఈ ఘనతను సాధించినట్టు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.

    రెండు పాటలు..

    రెండు పాటలు..

    ఒక్క పాట కాదు అల వైకుంఠపురములో నుంచి రెండు పాటలు ఆ జాబితాలో చోటు సంపాదించకున్నాయట. బుట్టబొమ్మ పాట 15, రాములో రాముల పాట 49వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికా కారణం తమన్ మ్యూజిక్, అల్లు అర్జున్ స్టెప్పులేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Ala Vaikunthapurramuloo Songs Placed In 100 Music Videos Global In Youtube. 100 Music Videos Globa List Is Buttabomma, Ramulo Ramula Songs Palced In youtube.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X